జూనియర్ ఎన్టీఆర్ వేసుకున్న బ్లేజర్ ఖరీదెంతో తెలుసా..?

ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ మరోవైపు ఎవరు మీలో కోటీశ్వరులు అనే రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే.కరోనా వల్ల తాత్కాలికంగా ఈ షో వాయిదా పడినా జూన్ లేదా జులై నుంచి ఈ షో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

 Unknown Facts About Jr Ntrs Blazer Price From Evaru Meelo Koteesarulu Song-TeluguStop.com

కొన్నేళ్ల క్రితం బిగ్ బాస్ అనే రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరించి మెప్పించిన జూనియర్ ఎన్టీఆర్ ఈ షోతో మళ్లీ మెప్పిస్తాడని ప్రేక్షకులు భావిస్తున్నారు.

బుల్లితెర అయినా వెండితెర అయినా నటనతో మెప్పించే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోమోలో బ్లేజర్ లో స్టైలిష్ లుక్ లో కనిపించారు.

 Unknown Facts About Jr Ntrs Blazer Price From Evaru Meelo Koteesarulu Song-జూనియర్ ఎన్టీఆర్ వేసుకున్న బ్లేజర్ ఖరీదెంతో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మనీష్ మల్హోత్రా ఈ బ్లేజర్ ను డిజైన్ చేయగా ఈ బ్లేజర్ ఖరీదు ఏకంగా 90వేల రూపాయలు అని సమాచారం.ఎవరు మీలో కోటీశ్వరులు షో కొరకు మనీష్ మల్హోత్రా ఎన్టీఆర్ కోసం కొత్త ఫ్యాషన్స్ ను డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ షో గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో స్టార్ మా ఛానెల్ లో ప్రసారమై బ్లాక్ బస్టర్ హిట్టైంది.నాగార్జున, చిరంజీవి ఈ షోకు హోస్ట్ లుగా వ్యవహరించారు.

సామాన్యులను కోటీశ్వరులను చేసే ఈ షో రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ లను సాధిస్తుందని జెమినీ ఛానల్ నిర్వాహకులు భావిస్తున్నారు.ఈ షో ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.

ఈ మధ్య కాలంలో రియాలిటీ షోలకు ఆదరణ పెరిగిన నేపథ్యంలో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ అన్నీ రియాలిటీ షోలను ఎక్కువగా ప్రసారం చేస్తున్నాయి.ఈ రియాలిటీ షో కొరకు ఎన్టీఆర్ రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ఒక్కో ఎపిసోడ్ కు ఎన్టీఆర్ 30 లక్షల రూపాయలు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

#EvaruMeelo #Unknown Facts #Blazer #Jr NTR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు