జెర్సీ చైల్డ్ ఆర్టిస్ట్ గురించి ఎవరికి తెలియని నిజాలు!

టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరో నాని గురించి అందరికి తెలిసిందే.ఆయన నటన ఆయనకు ఎంతగానో గుర్తింపు అందించింది.

 Unknown Facts About Jersey Movie Child Artis-TeluguStop.com

ఇప్పటికీ నాని సినిమాలు ఎంతో నాచురల్ గా ఉంటాయి.ఆయన నటించే ప్రతి ఒక్క సినిమాలో మంచి అనుభూతి చెందేలా ఉంటాయి.

ఇదిలా ఉంటే నాని నటించిన స్పోర్ట్స్ సినిమా జెర్సీ.ఈ సినిమా ఎంత విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.

 Unknown Facts About Jersey Movie Child Artis-జెర్సీ చైల్డ్ ఆర్టిస్ట్ గురించి ఎవరికి తెలియని నిజాలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన జెర్సీ సినిమా 2019 ఏప్రిల్ 19న విడుదల అయ్యింది.ఇందులో నాని హీరోగా నటించగా, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది.

సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాకు నిర్మాతగా చేయగా, అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ ఈ సినిమాని తెరకెక్కించగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమాలో నాని, అర్జున్ పాత్రలో బాగా మెప్పించాడు.అందులో అర్జున్ కొడుకు గా నాని పాత్ర పోషించిన చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగా నటించాడు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన ఈ పిల్లాడి పేరు రోనిత్ కామ్రా.ఇతని తల్లి పేరు సోనియా కామ్రా.తండ్రి పేరు విపిన్ కామ్రా.వీళ్లది ఢిల్లీ.కానీ రోనిత్ పంజాబీ కుటుంబానికి చెందిన పిల్లోడు.జెర్సీ సినిమాలో నటించక ముందు ఇతను ‘ఫ్యాబ్ ఇండియా’, ‘ హార్లిక్స్’,’ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్’,’ టప్పర్ వేర్’ వంటి బుల్లితెర ప్రకటనలలో నటించాడు.

ఇక్కడి నుంచే అతను సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు.ఇదిలా ఉంటే జెర్సీ సినిమాను హిందీలో రీమేక్ చేయనుండగా.

అందులో కూడా రోనిత్ కామ్రా కొడుకు పాత్రలు పోషించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి

.

#Child Artist #Jersey #Nani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు