జైనమతానికి చెందిన సన్యాసులు నోటికి అడ్డుగా పట్టి ఎందుకు ధరిస్తారో తెలుసా?దాని వెనుక ఉన్న కారణం ఇదే.!  

Unknown Facts About Janes -

ప్రపంచంలో అనేక మ‌తాలు ఉన్నాయి.ప్రతి మతంలో అనేక రకాల ఆచారాలు,సంప్రదాయాలు ,విశ్వాసాలు ఉన్నాయి.

Unknown Facts About Janes

వాటిని నమ్మే భక్తులపైన ఆధారపడి ఉంటుంది.ఈ క్ర‌మంలోనే ఆ మ‌తానికి చెంది స‌న్యాసులు పాటించే ఆచారాలు కూడా అనేకం ఉంటాయి.

అలాంటి వాటిలో జైన స‌న్యాసులు పాటించే ముహ‌ప‌ట్టి ఆచారం ఒకటి.జైన మ‌తానికి చెందిన స‌న్యాసులు ఎప్పుడూ తెల్లని వస్త్రంతో తయారుచేసిన ముహ‌పట్టి ధ‌రించే ఉంటారు.

వారు ఎందుకు అలా ధరిస్తారు.దాని వెనుక ఉన్న కారణం తెలుసా.

జైనులు అహింస ధ‌ర్మాన్ని పాటిస్తారు.ఇక ఆ మ‌తానికి చెందిన స‌న్యాసులు అయితే దీన్ని కొంచెం ఎక్కువ‌గానే పాటిస్తార‌ని చెప్ప‌వ‌చ్చు.దానికి ఉదాహరణ ముహపట్టి ధరించడమే.అయితే సాధార‌ణంగా మ‌నం శ్వాస తీసుకునేట‌ప్పుడు నోట్లోకి కూడా కొన్ని క్రిములు వెళ్తాయి.

కానీ అవి అక్క‌డ ఉండ‌లేవు.చ‌నిపోతాయి.

ఇలా క్రిములు చ‌నిపోవ‌డం అంటే హింస చేసిన‌ట్టే క‌దా.ఇది వారి ధర్మానికి విరుద్ధం.

క‌నుకనే అలా జ‌ర‌గ‌కుండా ఉండేందుకు గాను జైన స‌న్యాసులు నోటికి ముహ‌ ప‌ట్టి ధ‌రిస్తారు.దీంతో నోట్లోకి క్రిములు వెళ్ల‌వు.

అవి చ‌నిపోవు.

అయితే జైన మ‌తంలో స‌న్యాసులే కాదు, కొంద‌రు సాధార‌ణ పౌరులు కూడా ఇలా చేస్తారు.

కానీ వారు నోటికి ముహ‌ప‌ట్టి ధరించ‌రు.కాక‌పోతే వారు మాట్లాడిన‌ప్పుడ‌ల్లా నోటికి చేయి అడ్డం పెట్టుకుంటారు.

లేదంటే తెల్ల‌ని క‌ర్చీఫ్‌ను అడ్డు పెట్టుకుంటారు.ఇలా చేసినా వారి ఆచారం పాటించిన‌ట్టే అవుతుంద‌ట‌.

కానీ స‌న్యాసులు మాత్రం ఇక నిరంత‌రంగా అలా ముహ‌ప‌ట్టీ ధ‌రించే ఉంటారు.అదండీ వారి ముహపట్టి వెనుక అసలు కారణం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

GENERAL-TELUGU

footer-test