జబర్దస్త్ శాంతి స్వరూప్ గురించి ఈ షాకింగ్ నిజాలు తెలుసా.? లేడీ గెటప్ ఛాన్స్ ఎలా వచ్చిందంటే.?       2018-06-30   00:57:57  IST  Raghu V

వినోదం కి మనం అత్యంత ప్రాముఖ్యత ఇస్తాము అనడంలో అతిశయోక్తి ఏం లేదు అనుకుంట. గురు, శుక్రవారాలు వస్తే చాలు రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాము. అంతలా వీక్షిస్తాము మనం “జబర్దస్త్” ప్రోగ్రాం ను. అయితే జబర్దస్త్ స్టేజ్ పై లేడీ గెటప్స్ తో అలరించే నటుల్లో శాంతిస్వరూప్ ఒకరు. సన్నగా కనిపిస్తూ స్టేజ్ పై నవ్వుల సందడి చేసే శాంతిస్వరూప్ ఎన్ని కష్టాలు ఎదురుకున్నారో తెలుసా.? జబర్దస్త్ కి రాకముందు రూమ్ రెంట్ కూడా కట్టుకోలేని స్థితిలో ఉండేవారు అంట.

‘‘2001 లో నేను హైదరాబాద్ వచ్చాను. నా క్షేమ సమాచారాన్ని ఇంటికి ఉత్తరాల ద్వారా తెలియపరిచేవాడిని. ఇక్కడ నేను ఎంతగా కష్టాలు పడుతున్నా .. ఆ విషయాలను ఎవరితోను చెప్పుకునేవాడిని కాను. వాళ్ల ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోయినా, నా నుంచి ఏమీ ఆశించేవాళ్లు కాదు. మా నాన్నకి అనారోగ్యం .. మంచి మందులు వాడే పరిస్థితి లేదు. అన్నయ్యలు ఉన్నప్పటికీ వాళ్ల ఆర్ధిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే”“మా నాన్న చనిపోయిన తరువాత నేను ఇంటికి వెళ్లాను. నేను బాగా సంపాదించేశానని ఊళ్లో వాళ్లంతా అనుకున్నారు. అన్నదమ్ములంతా కలిసి తలా రెండు వేలు వేసుకుని కార్యక్రమాన్ని జరిపించాలన్నారు. అప్పుడు నా దగ్గర 500 కూడా లేవు.. నాన్నను బతికించుకోలేకపోయాను .. చనిపోయిన తరువాత కూడా ఏమీ చేయలేకపోతున్నానే అనిపించింది. హైదరాబాద్ లో తెలిసినతనికి ఫోన్ చేసి .. మా ఊళ్లో తెలిసిన వారి ఎకౌంట్ నెంబర్ చెప్పి, 2000 వేయమని కోరాను. ఆయన చేసిన సాయంతో మాట దక్కింది” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

“ఎప్పుడైనా ఈవెంట్స్ కి వెళ్లినప్పుడు అవే పంచ్ లు కామెంట్స్ గా వినిపిస్తూ ఉంటాయా?” అనే ప్రశ్న ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో శాంతిస్వరూప్ కి ఎదురైంది. అప్పుడాయన స్పందిస్తూ “ఏయ్ రైలు కింద రూపాయి బిళ్లా .. పిండేసిన టూత్ పేస్ట్ .. టేకుచెక్క .. అంటూ అరుస్తూనే వుంటారు. అప్పుడు నేను పెద్దగా ఫీలవ్వను .. వాళ్లు అంతగా ‘జబర్దస్త్’కి కనెక్ట్ అయ్యారనుకుంటాన‌ని చెప్పాడు స్వ‌రూప్

కృష్ణా నగర్లో రూమ్ రెంట్ కట్టుకోలేని పరిస్థితుల్లో .. స్నేహితులను రిక్వెస్ట్ చేసుకుని వాళ్ల రూములో ఉండేవాడిని. రెంట్ కట్టేవాడిని కాదు గనుక, అందులో వుండేవాళ్లకి వంటచేసి పెట్టడం .. బట్టలుతకడం .. రూమ్ శుభ్రంగా ఉంచడం చేసేవాడినని చెప్పాడు. క్కడ ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ నాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. రూమ్ లోనుంచి వెళ్లిపొమ్మని అన్నారు.. నా బ్యాగ్ తీసి బైట పెట్టేసిన సందర్భాలూ ఉన్నాయి’ అని త‌న ప‌డ్డ క‌ష్టాల గురించి వివ‌రించాడు.

జబర్దస్త్’లో లేడీ గెటప్ వేసే ఆర్టిస్ట్ కావాలని రచ్చరవితో చమ్మక్ చంద్ర చెప్పాడట. అప్పటికే నాతో వున్న పరిచయం కారణంగా, రచ్చరవి నన్ను తీసుకెళ్లి చమ్మక్ చంద్రకి పరిచయం చేశాడు. ఆయన నాకు అవకాశం ఇచ్చాడు ..జబర్దస్త’తో నాకు మంచి గుర్తింపు వచ్చింది.