జబర్దస్త్‌లో బుల్లెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న బుల్లినటి..'ఫైమా'

Unknown Facts About Jabardasth Comedian Faima

బుల్లితెర రారాజు జబర్దస్త్ కామెడీ షో గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.గత కొన్నాళ్లుగా అన్ని కామెడీ షోలను దాటేసి జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ రాకెట్‌లా దూసుకుపోతున్నాయి.

 Unknown Facts About Jabardasth Comedian Faima-TeluguStop.com

ఈటీవీలో వచ్చే ఈ కామెడీ ప్రోగ్రామ్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.ఈ ప్రోగ్రాం ద్వారానే చాలా మంది బుల్లితెర యాక్టర్స్ ఫేమస్ అయ్యారు.

వారంతా ఇప్పుడు ఓ రేంజ్‌‌లో ఉన్నారంటే దానికి కారణం మల్లెమాల నిర్మాణంలో వచ్చిన జబర్దస్త్ కామెడీ షో అని చెప్పవచ్చు.ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో టాప్ కమెడియన్స్ సుధీర్, హైపర్ అది, శ్రీను, రామ్ ప్రసాద్ లాంటి వారు సైతం అంగీకరించారు.

 Unknown Facts About Jabardasth Comedian Faima-జబర్దస్త్‌లో బుల్లెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న బుల్లినటి..’ఫైమా’-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ షో ద్వారానే వారంతా సినిమా అవకాశాలను కూడా దక్కించుకున్నారనడంలో అతిశయోక్తి లేదు.

ఇకపోతే జబర్దస్త్ యాంకర్స్ రష్మీ, అనసూయ వీరి క్రేజ్ గురించి ఎవ్వరిని అడిగినా చెబుతారు.

తమదైన యాంకరింగ్ నైపుణ్యం, డ్యాన్సులు, అభినయం, ఎక్స్పోజింగ్స్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు.అదే విధంగా సినిమాల్లోనూ మంచి అవకాశాలు దక్కించుకుని ఏకంగా హీరోయిన్ల రేంజ్‌ను సంపాదించుకున్నారు.

వీరికి రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుతుంది.

అయితే, ఒకప్పుడు జబర్దస్త్ కామెడీ షో‌లో లేడీస్ ఉండేవారు కాదు.

మగవారే ఆడవారి గెటప్స్ వేసి నవ్వించేవారు.వీటికి ప్రధాన సూత్రధారి చమ్మక్ చంద్ర అని చెప్పవచ్చు.

ప్రతీ స్కిట్‌లో లేడీ గెటప్స్‌ వేసి.అత్తా కోడళ్లు, మొగుడు పెళ్లాల మధ్య వచ్చే కామన్ గొడవలతో కామెడీని పండిచేవాడు.

కానీ ప్రస్తుతం ఆ ట్రెండ్ మారింది.జబర్దస్త్‌లో ఆడవారు ఎంట్రీ ఇచ్చేసారు.

మగవారితో సమానంగా పంచులు వేస్తూ ఆడియెన్స్‌ను అలరిస్తున్నారు.

Telugu About Jabardasth Faimaa, Anasuya, Body Shaming, Chammak Chandra, Extra Jabardasth Show, Faima, Faimaa, Hyper Aadi, Jabardasth Comedian, Jabardasth Show, Mallemala, Rashmi, Sudheer-Movie

అయితే, ఇటీవల జబర్దస్త్ షోలో ఎంట్రీ ఇచ్చిన ఓ బుల్లి నటి తనదైన కామెడీ టైమింగ్‌తో అందరినీ అలరిస్తోంది.ఎంతో మంది సీనియర్ నటీమణులను దాటుకుని ముందుకు దూసుకుపోతోంది.ఆమె మరెవరో కాదు.

‘ఫైమా’.పటాస్ షో ద్వారా పరిచయమైన ఈ బుల్లితెర కమెడియన్ ప్రస్తుతం జబర్దస్త్ షోలో మంచి గుర్తింపును తెచ్చుకుంది.

హైపర్ ఆది లాంటి సీనియర్ కమెడియన్స్‌కు పోటీ నిస్తోంది.చూసేందుకు పెద్దగా గ్లామర్ లేకపోయినా.

మంచి బాడీ షేమింగ్‌ లేకపోయినా.తోటి కమెడియన్స్ తనపై వేసే పంచులను నెగెటివ్ గా తీసుకోకుండా వాటినే తనకు ప్లస్ పాయింట్స్ గా మలుచుకుంటోంది.

Telugu About Jabardasth Faimaa, Anasuya, Body Shaming, Chammak Chandra, Extra Jabardasth Show, Faima, Faimaa, Hyper Aadi, Jabardasth Comedian, Jabardasth Show, Mallemala, Rashmi, Sudheer-Movie

కరెక్ట్ టైమింగ్‌తో పంచులు వేస్తూ ప్రేక్షకులకు చేరువ అవుతోంది.ఇటీవల ఆడవారిపై, వారి పర్సనాలిటీ, బాడీ షేమింగ్ పై జబర్దస్త్‌లో విపరీతంగా కామెంట్స్ చేస్తుంటారు.అవి బూతు కంటెంట్ కిందకు వస్తాయని తెలిసినా ప్రేక్షకులు కూడా వాటినే ఎంకరేజ్ చేస్తున్నారు.దీంతో కమెడియన్స్ కూడా వాటికే అలవాటుపడిపోయారు.ఈ క్రమంలోనే తన బాడీషేమింగ్ పై ఎన్ని పంచులు వేసినా.వాటిని దీటుగా ఎదుర్కొంటూ ఫైమా అందరినీ అలరిస్తోంది.ఇకపైనా కూడా అలానే అలరిస్తూ ముందుకు సాగాలని కోరుకుందాం.’

.

#Rashmi #Faima #Mallemala #Chammak Chandra #Jabardasth Show

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube