హ్యాట్సాఫ్ : అమెరికాలో లక్షల జీతాన్ని కాదని..స్వదేశానికి వచ్చి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు.అంతేకాదు సమాజసేవ కూడా.!   Unknown Facts About IPS Santhosh Kumar Mishra     2018-10-28   09:50:01  IST  Raja

లక్షల్లో జీతం… విలాసవంతమైన జీవితం… ఉంటున్నది ప్రపంచంలోని టాప్‌ 10 నగ0రాల్లో ఒక నగరంలో.. ప్రపంచంతో పోటీ పడి మరీ వీలైనంత సంపాదించుకునేందుకు అవకాశం.. కానీ.. ఇవేవీ అతనికి తృప్తినివ్వలేదు. స్వదేశానికి తిరిగొచ్చేశాడు. సివిల్స్‌ రాశాడు. మొదటి అటెంప్ట్‌లోనే టాప్‌ ర్యాంక్‌లో పాస్‌ అయ్యాడు. ఐపీఎస్‌ ఆఫీసర్‌ అయి శాంతి భద్రలను ఓ వైపు పరిరక్షిస్తూనే మరో వైపు సామాజిక సేవలో అతను నిమగ్నయ్యాడు. అతనే.. బీహార్‌కు చెందిన సంతోష్‌ కుమార్‌ మిశ్రా.

సంతోష్‌ కుమార్‌ మిశ్రాది బీహార్‌లోని పాట్నా జిల్లా. అక్కడే పుట్టి పెరిగాడు. అతని తండ్రి ఇండియన్‌ ఆర్మీలో పనిచేసేవాడు. ప్రస్తుతం రిటైర్‌ అయ్యాడు. ఇక సంతోష్‌కు ముగ్గురు సోదరిలు ఉండేవారు. అయితే బీహార్‌లో పాఠశాల విద్యను అభ్యసించిన సంతోష్‌ 2004లో పూనె యూనివర్సిటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. అనంతరం అతనికి యూరప్‌లో టాప్‌ కంపెనీలో జాబ్‌ వచ్చింది. ఆరంభంలోనే లక్షల్లో వేతనం అతనికి లభించింది. అనంతరం యూరప్‌లో 4 సంవత్సరాలు జాబ్‌ చేశాక మళ్లీ యూఎస్‌లోని న్యూయార్క్‌లో మరో కంపెనీలో సంవత్సరానికి రూ.50 లక్షల వేతనంతో జాబ్‌ వచ్చింది. అందులో సంతోష్‌ కంటిన్యూ అయ్యాడు. అయితే అంత జీతం వచ్చినా, విలాసవంతమైన జీవితం ఉన్నా అవేవీ సంతోష్‌కు తృప్తినివ్వలేదు. దీంతో అతను తన నిర్ణయం మార్చుకున్నాడు. లక్షల రూపాయల వేతనం వచ్చే ఉద్యోగాన్ని విడిచి పెట్టాడు.

Unknown Facts About IPS Santhosh Kumar Mishra-

అలా అమెరికాలో జాబ్‌ను వదిలేసిన సంతోష్‌ ఇండియాకు వచ్చాడు. 2011లో సివిల్స్‌ రాశాడు. మొదటి ప్రయత్నంలోనే అందులో టాప్‌ ర్యాంక్‌ సాధించాడు. దీంతో 2012లో అతనికి మొదటగా యూపీలోని అమ్‌రోహా జిల్లాలో ఎస్‌పీగా పోస్టింగ్‌ వచ్చింది. తరువాత అదే రాష్ట్రంలో అంబేద్కర్‌ నగర్‌ జిల్లా ఎస్ఫీగా సంతోష్‌ బాధ్యతలు చేపట్టాడు. అయితే రెండు ప్రాంతాల్లోనూ తాను శాంతి భద్రతలను అదుపు చేసే పోలీస్ ఆఫీసర్‌గానే కాదు, సమాజ సేవలోనూ నిమగ్నమయ్యాడు. తనకు వీలు కుదిరినప్పుడల్లా స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠాలు చెప్పేవాడు. వారికి ఉచితంగా దుస్తులు, విద్యాసామగ్రి, ఆహార పదార్థాలను పంచడం ప్రారంభించాడు. ఇక స్కూల్‌ మానేసిన పిల్లల ఇండ్లకు స్వయంగా వెళ్లి వారి తల్లిదండ్రులను ఒప్పించి మళ్లీ ఆ పిల్లలను స్కూళ్లలోకి రప్పించాడు. అలా సంతోష్‌ ఓ వైపు పోలీస్‌గానే కాక, మరో వైపు సామాజిక సేవకుడిగా కూడా అందరి మన్ననలు అందుకుంటున్నాడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వ్యక్తులున్నారంటే గ్రేట్ అనకుండా ఉండలేం కదా..

2 Attachments