దేవుడికి కొబ్బరికాయ కొట్టేముందు ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?కుళ్లిన టెంకాయ వస్తే ఏం జరుగుతుందో తెలుసా??  

 • గుడికెళ్లినప్పుడైనా ,ఇంట్లో పూజ చేసినప్పుడైనా కచ్చితంగా చేసే పని కొబ్బరి కాయ కొట్టడంఎంతో పవిత్రమైనది మాత్రమే పరమాత్ముడికి సమర్పించాలనే ఉద్దేశంతోనే దేవుడికి టెంకాయ కొడతాంఎందుకంటే అందులో నీరు చాలా పవిత్రమైనది.అయితే ఈ టెంకాయ కొట్టినప్పుడు అది కుళ్లిపోవచ్చు,లేదంటే అందులో పువ్వు రావొచ్చుఇవి వేటికి సంకేతాలుకొబ్బరికాయ కొట్టేటప్పుడు ఏ ఏ జాగ్రత్తలు పాటించాలి…తదితర విషయాలు మీకోసం…

 • UNknown Facts About Indian Coconut-

  UNknown Facts About Indian Coconut

 • కొబ్బరికాయ కొట్టేముందు తీస్కోవాల్సిన జాగ్రత్తలు

 • మనుషుల్లోని అహం పోయేందుకు కొబ్బరి కాయను కొట్టే పద్ధతిని ప్రవేశపెట్టారట. అలాగే కొబ్బరి కాయకు ఉండే మూడు కళ్లు పరమేశ్వరుడికి ఉండే మూడు కళ్లని చాలా మంది భావిస్తారు. అయితే కొబ్బరికాయని కొట్టే ముందు దాన్ని శుభ్రంగా కడగాలని ఒక ఆచారం ఉంది. దీన్ని పాటించే వాళ్లు తక్కువ మంది ఉంటారు.

 • UNknown Facts About Indian Coconut-
 • అంతేకాదు టెంకాయను పెట్టి కొట్టే రాయి ఆగ్నేయ ముఖంగా ఉండాలి. కొందరు కొబ్బరి కాయను కొట్టిన తర్వాత దాన్ని విడదీయకుండా చేతిలో పట్టుకుంటారు. అలా చేయకూడదు. వెంటనే దాన్ని విడదీసి ఆ నీటిని ఏదైనా పాత్రలో పోయాలి. ఆ కొబ్బరినీటిని, విడిగా ఉన్న రెండు కొబ్బరి చిప్పలను దేవుడికి నివేదించాలి.

 • కొబ్బరికాయ పగిలే తీరుఫలితం

 • చాలా మంది టెంకాయ గుండ్రంగా పగలలేదని బాధపడుతుంటారు. దీని వల్ల తమకు కీడు జరుగుతుందని అనుకుంటారు.ఒకవేళ వంకర టింకరగా పగిలితే కూడా ఎలాంటి నష్టం లేదు. ఇక టెంకాయ గుండ్రంగా పగిలితే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి.

 • UNknown Facts About Indian Coconut-
 • సాధారణంగా కొన్ని కొబ్బరి కాయలు కుళ్లిపోయి ఉంటాయి. ఆ విషయం మనకు తెలియదు కాబట్టి దేవుడి దగ్గర కొడతాం. కుళ్లిపోతే ఏం కాదు, దాని వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు ఎందుకంటే మనకు తెలియకుండా జరిగిన పొరపాటు అది. మీరు కొట్టిన టెంకాయ కుళ్లి పోయింటే ఒకవేళ మీరు పూజ చేస్తూ ఉంటే దాన్ని ఆపేసి కాళ్లు చేతులు కడుక్కోని మళ్లీ పూజ ప్రారంభించండి. ఇక కొత్త వెహికిల్ కొనుక్కోని మీరు పూజ చేయిస్తుంటే కొబ్బరి కాయ చెడిపోతే వాహనాన్ని మళ్లీ శుభ్రం చేసి పూజ చేయించుకోండి. భక్తితో కొబ్బరి కాయ కొడితే చాలు.

 • UNknown Facts About Indian Coconut-
 • అలాగే టెంకాయలో పువ్వు కనపడితే అది మీకు శుభాలను తీసుకొస్తుంది. నూతన వధూవరులకు త్వరగా సంతానం కలుగుతుందనడానికి ఇది ఒక సూచన. టెంకాయ నిలువుగా పగిలితే మీ ఇంట్లో వారికి త్వరలో సంతానం కలుగుతుందని సూచన

 • UNknown Facts About Indian Coconut-