సెట్ లోకి వచ్చిన మొదటి రోజే బోరున విలపించిన సౌందర్య.. కారణం ఏంటి ?

సౌందర్య. ఈ పేరు అంటే నిన్నటి తరం యువత కి ఒక ఎమోషన్ లాంటిది.

 Unknown Facts About Heroine Soundarya, Heroine Soundarya, Romantic Scenes, Manavaralu Pelli Movie, Soundarya On Sets, Actress Soundarya-TeluguStop.com

ఆమె నటిగా, మహానటి గా, సావిత్రి తర్వాత అంతటి నటి గా పేరుగాంచింది.తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా సౌత్ ఇండియాలో, అలాగే బాలీవుడ్ లో సైతం తన పేరును చిరస్థాయిగా నిలిచి ఉండేలా సౌందర్య ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టింది.

సౌందర్య మొదటిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది 1993లో.ఆమె మొదటి చిత్రం ‘మనవరాలి పెళ్లి’ అనే సినిమా.

 Unknown Facts About Heroine Soundarya, Heroine Soundarya, Romantic Scenes, Manavaralu Pelli Movie, Soundarya On Sets, Actress Soundarya-సెట్ లోకి వచ్చిన మొదటి రోజే బోరున విలపించిన సౌందర్య.. కారణం ఏంటి -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ చిత్రం మొదటగా విడుదల అయినప్పటికి నిజానికి ఇది ఆమె మొదటి చిత్రం కాదు ‘రైతు భారతం’ అనే సినిమా ద్వారా రచయిత త్రిపురనేని మహారథి కుమారుడు ప్రసాద్ డైరెక్ట్ చేసిన సినిమా ద్వారా సౌందర్య 1994లో విడుదలైంది.

అయితే ఈ సినిమా 1992 మార్చి లో మొదటగా షూటింగ్ ప్రారంభించగా, ఈ సినిమాలో మొదటగా సౌందర్య భానుచందర్ కాంబినేషన్ లో కొన్ని సీన్స్ ఉన్నాయి.సౌందర్య మొదటి రోజే రొమాంటిక్ సీన్ పెట్టారు దర్శకుడు శ్రీ ప్రసాద్.మొదటి కొన్ని సీన్లు కాగానే సౌందర్య అసలు నాకు రావడం లేదు నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటూ గోల చేసిందట.

ఆ మాటలు వినగానే దర్శకుడు శ్రీ ప్రసాద్ తలపట్టుకున్నంత పనిచేశారట.ఇదేంటి ఈ అమ్మాయి ఇలా చేస్తుంది అనుకోని బాధపడ్డారు ఎలాగైనా సౌందర్య చేయాలని ట్రై చేశారట.

రచయిత మహారధీ వయసులో చాలా పెద్దాయన కావడంతో ఆయన ఎంతగా నచ్చచెప్పినా సౌందర్య వినలేదట.రొమాంటిక్ సన్నివేశాల్లో నటించమని సౌందర్య తండ్రి సత్యనారాయణ సైతం ఒప్పించలేకపోయారట.

మొదట సౌందర్య ను ఫ్యామిలీ వాతావరణం లోకి తీసుకెళ్లి మూడ్ క్రియేట్ చేయాలని శ్రీ ప్రసాద్ భావించాడట.అందుకోసం తన ఇంటి నుంచి భార్య పిల్లలను పిలిపించారట.దాంతో ఫ్యామిలీ వాతావరణం లోకి సౌందర్య వచ్చిందట.దర్శకుడు యాక్టింగ్ అంటే ఇంతే అని కుటుంబానికి నటనకు పెద్ద తేడా లేదని చెప్పి సౌందర్య చేత నటింపచేశారట.

అలా సినిమా విడుదలైంది.ఆ సినిమా ఆడకపోయినా సౌందర్య కి చాలా మంచి పేరు తీసుకొచ్చింది ఆ సినిమా.

ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి, ఆ తర్వాత తిరిగి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది సౌందర్య.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube