భీమ్లానాయక్.ఇప్పుడు ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా ఈ సినిమా పేరు వినిపిస్తోంది.
పవన్ కల్యాణ్, రానా ఇద్దరూ కూడా ప్రాణం పెట్టి నటించారు కాబట్టే ఈ సినిమా బ్రహ్మాండమైన రికార్డులతో దూసుకు పోతోంది.అయితే ఈ సినిమాలో రానా (డానియల్ శేఖర్)కు భార్యగా నటించిన ఆ అమ్మాయి ఎవరు అని ఇప్పుడు నెటిజనులు ఆమె కోసం సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు.
ఆమే అసలు పేరు సంయుక్త మీనన్.భీమ్లానాయక్ సినిమాలో ఈమే నటనకు ప్రేక్షకులందరూ ఫిదా అవుతున్నారు.
ముఖ్యంగా ఆమె క్లైమాక్స్ లో చూపించిన నటన అద్భుతంగా ఉందని ప్రేక్షకులంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
సంయుక్త మీనన్ మలయాళం అమ్మాయి.
అక్కడ ప్రెసెంట్ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.ఎకనామిక్స్ లో డిగ్రీ పట్టా పొందిన తర్వాత సినిమాల మీద ఉన్న ఇష్టంతో ఆ వైపుగా అడుగులు వేసి 2016లో పాప్కార్న్ అనే సినిమా ద్వారా మాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.
ఆ సినిమా హిట్ కావడంతో ఇక అక్కడి నుంచి ఈ అందాల భామ వెనక్కి తిరిగి చూసుకోలేదు.అలా ఒక్క మలయాళం లోనే కాకుండా తమిళ్లోనూ ఏడు పైగా సినిమాల్లో నటించింది.

ఇక మళయాలంలో సూపర్ డూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా ని ఆధారంగా చేసుకుని పవన్ కళ్యాణ్ అండ్ రానా తగ్గట్టుగా భీమ్లా నాయక్ సినిమాని రీమేక్ చేసారు.కాబట్టి ఈ సినిమాలో రెండో హీరోయిన్ ని కూడా మళయాలం నుంచే తీసుకోవాలని భావించిందట చిత్ర యూనిట్ అందుకే రానాకి జోడిగా సంయుక్త అయితే కరెక్ట్ గా ఉంటుందని ఆమెను తీసుకున్నారు… దానికి ఆమే వందకి వందశాతం న్యాయం చేసింది… అలాగే పవన్ కళ్యాణ్ లాంటి పవర్ స్టార్ సినిమా ద్వారా తెలుగులోకి అడుగు పెట్టడం నా అదృష్టం అంటూ తెగ సంబర పడుతుందట ఈ మలయాళ భామ.

అంతేకాదు ప్రస్తుతం మన తెలుగు నిర్మాత లందరు సంయుక్త డేట్స్ కోసం క్యూ కడుతున్నట్లు తెలుస్తుంది.సో, భీమ్లా నాయక్ సినిమా ఈ భామకు బాగానే కలిసొచ్చింది.మరి చూద్దాం ఈ భామ తెలుగులో ఎంత వరకు రాణిస్తుందో…
.