రోజా హీరోయిన్ గా ఎన్ని ఇబ్బందులను ఎదుర్కుందో..6 నెలలు మంచానికే పరిమితం

తెలుగు రాష్ట్రాల్లో రోజా గురించి తెలియ‌ని వారు ఉండ‌రు.ఏపీ రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్గా ముద్ర‌ప‌ట్టారు.

 Unknown Facts About Heroine Roja, Roja, Actress Roja, Roja Personal Life Struggles, Roja Biography, Heroine Roja Problems-TeluguStop.com

రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలియ‌న ఆమె.వైసీపీ స‌ర్కారులో మంచి ప‌ద‌విని పొందారు.ఆమె రాజ‌కీయాల్లోకి రాక ముందు వెండి తెర‌ను షేక్ చేశారు.త‌న అందచందాల‌తో ఎన్నో సినిమాల్లో న‌టించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందారు.రోజా సినీ జీవితంలో మీకు తెలియ‌ని ఎన్నో విష‌యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

రోజా అస‌లు పేరు శ్రీ‌లత‌.ప్రేమ త‌ప‌స్సు మూవీతో ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టింది.నిజానికి అంత‌కు ముందే చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది రోజా.రోజా తండ్రి వైఎస్‌రెడ్డికి సినిమా ఇండ‌స్ట్రీతో అనుబంధం ఉంది.ఆయ‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో పుత్త‌డిబొమ్మ పూర్ణ‌మ్మ అనే డాక్యుమెంట‌రీ తీశాడు.అందులో చిన్న‌ప్ప పూర్ణ‌మ్మ‌గా ఐదేండ్ల వ‌య‌సులోనే న‌టించింది రోజా.

 Unknown Facts About Heroine Roja, Roja, Actress Roja, Roja Personal Life Struggles, Roja Biography, Heroine Roja Problems-రోజా హీరోయిన్ గా ఎన్ని ఇబ్బందులను ఎదుర్కుందో..6 నెలలు మంచానికే పరిమితం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

డాక్ట‌ర్ శివ‌ప్ర‌సాద్‌.రాజేంద్ర ప్ర‌సాద్ కాంబినేష‌న్‌లో ప్రేమ త‌ప‌స్సు చిత్రాన్ని తీశాడు.

ఇందులో హీరోయిన్గా రోజాను ఎంపిక చేశాడు.ఆ సినిమా ప్రారంభానికి వ‌చ్చిన త‌మిళ ద‌ర్శ‌కుడు భార‌తీరాజా శ్రీ‌ల‌త పేరును రోజాగా మార్చాడు.

ఈ సినిమా యావ‌రేజ్‌గా ఆడింది.ఈ సినిమాతో రామానాయుడు దృష్టిలో ప‌డింది రోజా.

స‌ర్ప‌యాగం సినిమాలో ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు.ఆ త‌ర్వాత వ‌చ్చిన సీతారత్నం గారి అబ్బాయి సినిమాతో ఆమె కెరీర్ మంచి మ‌లుపు తీసుకుంది.

ఆ త‌ర్వాత త‌న అంద‌చందాల‌తో సినిమా ఇండ‌స్ట్రీలో దూసుకుపోయింది.అతికొద్ది స‌మ‌యంలోనే ఆగ్ర‌తార‌గా ఎదిగింది.సాంఘిక చిత్రాల‌తో పాటు జాన‌ప‌ద‌, చారిత్ర‌క‌, పౌరాణిక సినిమాల్లోనూ న‌టించింది.త‌న తోటి హీరోయిన్ల‌కు సాధ్యంకాని రీతిలో న‌ట‌న కొన‌సాగించింది.ముప్పై ఏండ్ల క్రిత‌మే ల‌క్ష రూపాయ‌ల పారితోషికం తీసుకుని అంద‌రినీ అబ్బుర‌ప‌రిచింది.త‌మిళ ఇండ‌స్ట్రీలో ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న న‌టించి నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్గా ఎదిగింది.

మాతృభాష మీద మ‌మ‌కారంతో తెలుగు ఇండ‌స్ట్రీకే ప‌రిమితం అయ్యారు.అనంత‌రం స‌మ‌రం అనే సినిమాను తానే స్వ‌యంగా నిర్మించింది రోజా.

ఆర్కే సెల్వ‌మ‌ని ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది.అయితే ఈ మూవీ అంత‌గా ఆడ‌లేదు.

అదే స‌మ‌యంలో త‌న‌కు యాక్సిడెంట్ కావ‌డంతో ఆరు నెల‌ల పాటు మంచానికే ప‌రిమితం అయ్యింది.త‌న‌తో సినిమా అగ్రిమెంట్ చేసుకున్న వాళ్లు ఆయా సినిమాల నుంచి రోజాను తొల‌గించి వేరే హీరోయిన్ల‌తో కంటిన్యూ అయ్యారు.

త‌ర్వాత కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన లాఠీ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.అదే స‌మ‌యంలో చిరంజీవి న‌టిస్తున్న ముగ్గురు మొన‌గాళ్లు సినిమాలో రోజాకు అవ‌కాశం వ‌చ్చింది.ఈ సినిమాలో చామంతి పువ్వా అనే పాట మాత్ర‌మే చేయ‌గ‌లిగింది.ఈ పాట మంచి ప్ర‌జాద‌ర‌ణ పొందింది.అక్క‌డి నుంచి వెనుతిరిగి చూడ‌లేదు.తెలుగులో అంద‌రు టాప్ హీరోల‌తో న‌టించింది.

అనంత‌రం చామంతి సినిమాతో ప‌రిచ‌యం అయిన సెల్వ‌మ‌నిని ప్రేమించి పెళ్లి చేసుకుంది రోజా.వారికి ఇద్ద‌రు పిల్ల‌లు.ప్ర‌స్తుతం ఆమె రాజ‌కీయాల్లో ఫుల్ బిజీగా కోన‌సాగుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube