29 మంది అత్యాచారం.." class="img-responsive wp-post-image" alt="" scale="0" onContextMenu="return false;">

శోభన్ బాబు ని పట్టుకొని అంత మాట అన్నది ఎవరు..?

అప్పట్లో ప్రముఖ దర్శకులలో ఒక్కరు మధుసూదనరావు.ఆయన పేరు వినగానే హీరోలు సైతం భయపడేవారంట.

 Unknown Facts About Hero Sobhan Babu-TeluguStop.com

ఇక ఆయన సెట్‌ లో ఉన్నారంటే ప్రతి ఒక్కరికీ హడలెత్తిపోయేవారంట.అయితే ఆయనకు కోపం వస్తే ఎవర్నీ వదలకుండా తిట్టడం ఆయన నైజం అని అందరికి తెలిసిన సంగతి.

ఇక అలా ఆయన చేతిలో తిట్లు తిన్న వారిలో స్టార్లు కూడా ఉన్నారు.ఇక అలనాటి అందాల హీరో శోభన్‌బాబును కూడా మధుసూదనరావు చాలాసార్లు తిట్టారంట.

 Unknown Facts About Hero Sobhan Babu-శోభన్ బాబు ని పట్టుకొని అంత మాట అన్నది ఎవరు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా.తనకు ఎంత స్టార్ డమ్ ఉన్నా.శోభన్ బాబు ఎన్నడూ మధుసూదనరావు పై సీరియస్ అవ్వలేదంట.అందుకు కారణం.

శోభన్ బాబు అవకాశాల కోసం తిరుగుతున్న రోజుల్లో మధుసూదనరావు చాల సహాయం చేశారంట.అయితే కొన్ని సినిమాలు కూడా ఇప్పించారు.

ఇక అందుకే శోభన్ బాబు, ఆయనను గురువుగా భావించినట్లు తెలిపారు.అంతేకాక.

ఓ రోజు స్టార్ హీరో అని కూడా చూడకుండా సెట్ లో అందరి ముందు తిట్టారు మధుసూదనరావు.

అయితే ఆ రోజు మాత్రం శోభన్ బాబు చాల బాధపడ్డారంట.

ఇక ‘పెద్ద హీరోని నన్నే మీ దర్శకుడు అలా తిట్టాడేంటయ్యా’ అని అప్పటికీ అసోసియేట్ దర్శకుడిగా పని చేస్తోన్న రాఘవేంద్రరావుతో చెప్పుకుని శోభన్ బాబు బాధపడ్డారట.అయితే ఒక విధంగా శోభన్ బాబుకి – రాఘవేంద్రరావుకి మధ్య సాన్నిహిత్యం పెరగడానికి కూడా అదే కారణం అని చెప్పాలి.

అంతేకాక.ఆ చనువు కారణంగా రాఘవేంద్రరావుకి దర్శకుడిగా శోభన్ బాబు మొదటి అవకాశం ఇచ్చారు.

ఇక తిరుగులేని దర్శకుడిగా రాణిస్తున్న మధుసూదనరావు జీవితం ఒక్కసారిగా తారుమారైంది.అంతేకాక.వరుస పరాజయాలతో అవకాశాలు లేక చాల ఇబ్బందులు ఎదుర్కొన్నారంట.కాగా.ఓ దశలో నిర్మాతలు ఆయనను పట్టించుకోవడం కూడా మానేశారంట.అంతేకాక.

మిగిలిన అప్పటి ప్రముఖ నటీనటులు కూడా మధుసూదనరావును దూరంపెట్టారంట.ఇక ఈ విషయం తెలిసిన శోభన్ బాబు, తానే సినిమా ఇప్పించి మధుసూదనరావుకి డేట్లు ఇచ్చారంట.

అయితే తనను అవమానించినా అవకాశం ఇచ్చిన శోభన్ బాబు వ్యక్తిత్వం గొప్పది అనే చెప్పాలి.

#Sobhan Babu #Raghavendra Rao #Madhusudanarao

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు