తెలుగులో ప్రముఖ దర్శకుడు భాస్కర్ దర్శకత్వం వహించిన “బొమ్మరిల్లు” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ప్రముఖ నటుడు “సిద్ధార్థ్” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటుడు సిద్ధార్థ సినిమా జీవిత పరంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికీ తన వైవాహిక జీవితంలో తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా కొంతమేర ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.
అయితే హీరో సిద్ధార్థ 2003వ సంవత్సరంలో న్యూఢిల్లీలో తన పొరుగింట్లో నివాసం ఉంటున్న మేఘన అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.కానీ ఏమైందో ఏమోగాని పెళ్లయిన మూడు సంవత్సరాలకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు, విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని 2007వ సంవత్సరంలో విడిపోయారు.
అయితే అప్పటికే వీరిద్దరికీ మొగ్లీ అనే కొడుకు జన్మించడంతో తన కొడుకు సంరక్షణను సిద్ధార్థ్ తీసుకున్నాడు.ఆ తర్వాత సిద్ధార్థ మళ్లీ పెళ్లి చేసుకోక పోయినప్పటికీ పలువురు టాలీవుడ్ హీరోయిన్లతో లవ్ అఫైర్లు మాత్రం బాగానే నడిపాడు.
ఈ క్రమంలో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ హీరోయిన్ హీరో సిద్ధార్థ్ తో తన ప్రేమాయణం గురించి అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం హీరో సిద్ధార్థ తెలుగులో “మహా సముద్రం” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.అలాగే ఈ చిత్రంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు శర్వానంద్ కూడా సిద్ధార్థ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.కాగా ఈ చిత్రానికి ఆర్ఎక్స్100 చిత్ర మూవీ దర్శకుడు “అజయ్ భూపతి” దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తయినప్పటికీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడటంతో ఈ చిత్ర విడుదలను కొంత కాలం పాటు తాత్కాలికంగా వాయిదా వేశారు.