రాజశేఖర్ అనారోగ్యంతో లేవలేని స్థితిలో ఉండి చేసిన చిత్రం ఏంటో తెలుసా.. ? హిట్టా ఫట్టా.. ?

డాక్టర్.రాజశేఖర్ కు మంచి పేరు తీసుకొచ్చిన సినిమాలు ప్ర‌తిఘ‌ట‌న‌, తలంబ్రాలు.ఆహుతి.తలంబ్రాలు సినిమా నిర్మించిన ఎం.శ్యామ్‌ప్ర‌సాద్‌ రెడ్డి ఆహుతి మూవీని సైతం నిర్మించాడు.అటు తలంబ్రాలు సినిమాకు దర్శకత్వం వహించిన కోడి రామ‌కృష్ణ ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించాడు.

 Unknown Facts About Hero Rajasekhar Ahuthi Movie-TeluguStop.com

ఆహుతి కథ విన్నప్పుడే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అననుకున్నాడట రాజశేఖర్.కానీ తను అనుకున్న దానికంటే ఇంకా భారీ విజయం సాధించింది ఈ సినిమా.

ఈ మూవీలో రాజశేఖర్ చేసిన అశోక్ పాత్రకు జనాలు ముగ్ధులైపోయారు.

 Unknown Facts About Hero Rajasekhar Ahuthi Movie-రాజశేఖర్ అనారోగ్యంతో లేవలేని స్థితిలో ఉండి చేసిన చిత్రం ఏంటో తెలుసా.. హిట్టా ఫట్టా.. -Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాలలో అశోక్ పాత్ర ఎలా ఉంటుందో.

ఈ పాత్ర చేసే సమయంలో ఎలా నడుచుకోవాలో దర్శకుడు కోడి.రాజశేఖర్ కు వివరించాడట.

అంతేకాదు.ఈ పాత్రను అద్భుతంగా రూపొందించి.

దానికి తగినట్లుగా రాజశేఖర్ చేతి నటింపజేశాడట కోడి రామ‌కృష్ణ‌.అనుకున్న సీన్ అనుకున్నట్లుగా తెరకెక్కించాడట దర్శకుడు.

అయితే ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో రాజశేఖర్ హెల్త్ సరిగా లేదట.కానీ అద్భుత పాత్ర దొరికినప్పుడు చేయకపోతే బాగోదు అనుకున్నాడట రాజశేఖర్.

అందుకే ఈ సినిమా ఎలాగైనా చేయాలనే పంతం పట్టాడట.ఆనారోగ్యం ఉన్నా లెక్క చేయకుండా అశోక్ పాత్రలో జీవించాడట రాజశేఖర్.

Telugu Ahuti Movie, Facts Behind Ahuthi Movie, Kodi Ramakrishna, No Doop, Rajasekhar, Rajasekhar Ashok Role, Rajasekhar Unhealthy, Super Dooper Hit Movie, Talambralu Movie, Villain Ahuti Prasad-Telugu Stop Exclusive Top Stories

ఈ సినిమాలో ఎక్కడ కూడా డూప్ పెట్టుకోలేదట రాజశేఖర్.ఫైట్స్ లో కానీ, బిల్డింగ్స్ మీద నుంచి దూకే సీన్లలో కానీ ఎక్కడా డూప్ వాడలేదట.అయినా ఇంకా బాగా నటించలేకపోయానే అనుకున్నాడట రాజశేఖర్.తన సన్నిహితులు మాత్రం బాగా చేశావని చెప్తున్నా తనలో బాగా చేయలేదనే బాధ మాత్రం ఉన్నట్లు చెప్పాడు.1987 డిసెంబ‌ర్ 3న‌ విడుదల అయిన ఆహుతి మూవీ సూపర్ డూపర్ హిట్ సాధించింది.ఈ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రసాద్ ఆహుతి ప్రసాద్ గా మారిపోయాడు.

ఈ సినిమా కోసం గణేష్ అందించిన డైలాగులు పటాసుల్లా పేలిపోయాయి.మొత్తంగా రాజశేఖర్ జీవితంలో ఓ మైలు రాయిగా ఆహుతి సినిమా నిలిచిపోయింది.

#FactsBehind #SuperDooper #RajasekharAshok #Rajasekhar #VillainAhuti

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు