హీరో రాజశేఖర్ గురించి ఎవరికి తెలియని పచ్చి నిజాలు ఇవే?

ఒకప్పుడు అత్యంత పారితోషికం తీసుకునే వారిలో ఒకరైన తెలుగు, తమిళ నటుడు రాజశేఖర్.గత 20 సంవత్సరాల క్రితం తెలుగులో ఆయన తీసిన సినిమాలు ఇప్పటికీ ఎవర్ గ్రీనే.తన నటనతో అభిమానులకు అత్యంత చేరువైన రాజశేఖర్ బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపించారు.35 ఏళ్ల క్రితమే సినిమా ఫీల్డ్ లోకి వచ్చిన ఈయన వందేమాతరం సినిమాతో పరిచయమై అంకుశం, అవేశంలాంటి ఎన్నో చిత్రాలతో భారీ విజయాలను అందుకున్నారు.ఆయన ఆవేశపరుడైన యువకుని పాత్రలకు ప్రసిద్ధి.అందుకే ఆయనకు యాంగ్రీ యంగ్‌మాన్ అని పేరు.

 Unknown Facts About Hero Rajasekhar-TeluguStop.com

ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండే రాజశేఖర్ కొంతకాలం తర్వాత చేసిన ప్రతీ సినిమా అపజయాన్నే చవి చూసింది.కొన్ని చిత్రాలైతే అసలు ఎప్పుడు వచ్చాయో.

ఎప్పుడు వెళ్లాయో కూడా తెలియదు.దీంతో రూటు మార్చిన ఈయన.నిర్మాతగా మారి సినిమాలు తీయడం మొదలు పెట్టారు.అందులోనూ తగిన గుర్తింపు రాక తీవ్ర అప్పుల పాలయ్యారు.

 Unknown Facts About Hero Rajasekhar-హీరో రాజశేఖర్ గురించి ఎవరికి తెలియని పచ్చి నిజాలు ఇవే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒకప్పుడు తను తీసుకున్న పారితోషికం కంటే తను ఎదుర్కొంటున్న అప్పులు ఎక్కువైనాయి.మధ్యలో చేసిన గోరింటాకు, ఎవడైతే నాకేంటి సినిమాలు చేసినా… అవి అప్పుల నుంచి మాత్రం బయటపడనివ్వలేక పోయాయి.

వాటిని తీర్చేందుకు ఒకానొక సమయంలో చెన్నైలోని తన ఒక ఇంటిని కూడా అమ్ముకున్నారని అప్పట్లో టాక్.

ఇదిలా ఉండగా తన కెరీర్ లో వెనకబడడానికి చిరంజీవి కూడా ఓ కారణమని ఇప్పటికీ వార్తలు వస్తూనే ఉన్నాయి.

వాళ్లిద్దరి మధ్య నేటికీ కంటికి కనిపించని శతృత్వం కొనసాగుతూనే ఉంది.

Telugu Actor, Evadaite Nakenti, Gorintaku, Hero, Maa Association, Megastar Chiranjeevi, Producer, Rajasekhar, Tollywood, Tollywood Hero, Unknow Facts-Movie

కొన్ని సినిమాల్లో చిరంజీవికి వ్యతిరేకంగా డైలాగులు విసిరిన సందర్భాలూ లేకపోలేదు.చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తొలినాళ్లలో ఆయనకు ఎలాంటి అనుభవం లేదు ఒకవేళ ఉన్నా రాజకీయాల్లో సక్సెస్ కాలేరన్న రాజశేఖర్ మెగా అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.ఆ తర్వాత చిరంజీవి వెళ్లి మాట్లాడడంతో విషయం కాస్త సద్దుమణిగింది.

అంతా బాగుంది అనుకున్నా సమయంలోనే మా అసోసియేషన్ డైరీ లాంచింగ్ కార్యక్రమంలో చిరంజీవితో పాటు అక్కడున్న ప్రముఖులను సైతం ఎన్నో మాటలన్నారు.

Telugu Actor, Evadaite Nakenti, Gorintaku, Hero, Maa Association, Megastar Chiranjeevi, Producer, Rajasekhar, Tollywood, Tollywood Hero, Unknow Facts-Movie

ఆ తర్వాతే మా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.ఇంత జరుగుతున్నా బయటకు మాత్రం తనకు, చిరంజీవి మంచి స్నేహితుడు అనే చెప్పుకుంటారు రాజశేఖర్.

ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనల కారణంగా… ఇలా జరుగుతుంది గానీ… ఒకప్పుడు ఇద్దరూ నిజంగానే మంచి స్నేహితులు.

ఒకరి సినిమాలకు ఒకరు వస్తూ ఎంతో కలివిడిగా ఉండేవారు.చూద్దాం వీరి మధ్య రోజు రోజుకూ పెరుగుతున్న శతృత్వం… ఇంకా ఎన్ని ఘటనలకు దారి తీస్తుందో.!

.

#MAA #Gorintaku #Rajasekhar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు