కార్తికేయ కెరీర్ ముగిసినట్టేనా..ఎవ్వరు పట్టించుకోవడం లేదు పాపం

సినిమా అనే రంగుల ప్రపంచం చాలా మాయగా ఉంటుంది.క్రేజ్ ఉంటే తెరమీద సందడి చేస్తారు.

 Unknown Facts About Hero Karthikeya , Karthikeya, Hero, Raja Vikramarka Title, R-TeluguStop.com

లేదంటే తెరమరుగైపోతారు.హీరోకి వరుసగా రెండు హిట్లు పడితే దర్శక నిర్మాతలు వారి వెంట తిరుగుతారు.

సినిమాలు చేస్తామని ఆఫర్లు ఇస్తారు.అదే హీరోకి రెండు ఫ్లాపులు వస్తే అతడి వైపు కన్నెత్తి కూడా చూడరు.

తనెవరో తెలియనట్లు నటిస్తారు.అతడి ఇంటివైపు కూడా కన్నెత్తి చూడరు.

అందుకే సినిమా పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం.హీరోకి మంచి టాలెంట్ ఉన్నా.

ఫ్లాఫులు వస్తే అతడి కెరీర్ చిక్కుల్లో పడినట్లు అనిపిస్తుంది.తాజాగా అదే పరిస్థితిలో ఉన్నాడు హీరో కార్తికేయ.

అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాడు కార్తికేయ.ఈ సినిమాలో ఆయనతో కలిసి నటించింది పాయల్ రాజ్ పుత్.

ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఇద్దరికి మంచి క్రేజ్ వచ్చింది.ఆ తర్వాత కార్తికేయకు వరుసగా ఆఫర్లు వచ్చాయి.

హిప్పి , గుణ 369 , 90 ఎంఎల్ సినిమాల్లో నటించాడు.కానీ ఈ మూడు సినిమాలు ఘోర పరాజయం పాలయ్యాయి.

కార్తికేయ చివరి సినిమా చావు కబురు చల్లగా కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.దీందో ఆయనను ఫిల్మ్ మేకర్స్ తో పాటు జనాలు కూడా పట్టించుకోవడం లేదు.

Telugu Ml, Ajay Bhupathi, Grand, Guna, Ravichandran, Hippie, Karthikeya, Raja Vi

ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటించి 1990 లో విడుదలైన రాజా విక్రమార్క సినిమా పేరును తన సినిమా పేరు గా పెట్టుకున్నాడు కార్తికేయ.శ్రీ సరిపల్లి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను రూపందిస్తునాడు.ఈ మధ్య విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి గుర్తింపు వచ్చింది.ఈ సినిమాలో కన్నడలో స్టార్ హీరో రవిచంద్రన్ మనువరాలు తాన్య రవిచంద్ర హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాతోనైనా కార్తికేయ కెరీర్ మంచి మలుపు తిరుగుతుందేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube