రాఘవేంద్ర రావు బాలకృష్ణ కి ఒక్కటంటే ఒక్క హిట్ ఎందుకు ఇవ్వలేకపోయాడు

ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్రరావు. తెలుగు సినీ ప్ర‌పంచంలో త‌నకంటూ గొప్ప చ‌రిత్ర లిఖించుకున్న డైరెక్ట‌ర్.

 Unknown Facts About Hero Balakrishna And Raghavendra Rao, Raghavendra Rao,  Bala-TeluguStop.com

హేమీ హేమీ న‌టుల‌కు ఎన్నో మెమ‌ర‌బుల్ హిట్స్ అందించాడు.అల‌నాటి మేటి న‌టుడు ఎన్టీఆర్‌తో 12 సినిమాలు చేశాడు.

అన్నీ సూప‌ర్ డూప‌ర్ హిట్స్.ఎన్టీఆర్‌తో పాటు శోభ‌న్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, మోహ‌న్‌బాబు, నాగార్జున‌, వెంక‌టేష్ స‌హా టాప్ హీరోలందరితో ప‌నిచేశారు.

ఎన్నో మంచి హిట్స్ అందించారు.అయితే.

నంద‌మూరి బాల‌కృష్ణ‌కు మాత్రం స‌రైన హిట్ ఇవ్వ‌లేదు ఈ ద‌ర్శ‌కేంద్రుడు.ఇంత‌కీ బాల‌కృష్ణ‌తో రాఘ‌వేంద్ర‌రావు ఎన్ని సినిమాలు తీశాడు? ఎందుకు అవి హిట్ కాలేదు? అనే విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం!

రాఘ‌వేంద్ర‌రావు, బాల‌కృష్ణ కాంబినేష‌న్‌లో మొత్తం 7 సినిమాలు వ‌చ్చాయి.అందులో ఓ పౌరాణిక చిత్రం సైతం ఉంది.వీటిలో ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా హిట్ మూవీ లేదు.

రాఘ‌వేంద్రుడితో బాల‌య్య తొలి చిత్రం రౌడీ రాముడు కొంటె కృష్షుడు.ఈ సినిమాకు ఎన్టీఆర్ నిర్మాత‌.

మెయిన్ హీరో కూడా ఆయ‌నే.ఎన్టీఆర్ త‌మ్ముడి క్యారెక్ట‌ర్ బాల‌కృష్ణ పోషించాడు.

ఈ సినిమాలో ఆయ‌న బ్యాంకు ఉద్యోగి.ఈ సినిమా అంత‌గా హిట్ కాలేదు.

బాల‌కృష్ణ‌తో రాఘ‌వేంద్ర‌రావు తీసిన రెండో మూవీ ప‌ట్టాభిషేకం.ఈ మూవీ అయ్యాక బాల‌య్య మాస్ హీరోగా మారాడు.మంగ‌మ్మ గారి మ‌నువ‌డు సినిమాతో సూప‌ర్ హిట్ సాధించాడు.ఈ నేప‌థ్యంలో బాల‌య్య‌తో రాఘ‌వేంద్ర రావు సినిమా అన‌గానే అభిమానులు సంతోషించారు.మంచి హిట్ వ‌స్తుంద‌నుకున్నారు.కానీ ప‌ట్టాభిషేకం స‌రైన విజ‌యం సాధించ‌లేదు.

ఆ త‌ర్వాత బాల‌య్య‌తో రాఘవేంద్ర‌రావు అపూర్వ సోద‌రులు సినిమా తీశాడు.భారీ హంగుల‌తో తెర‌కెక్కినా ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను అంత‌గా ఆక‌ట్టుకోలేదు.

ఆ త‌ర్వాత ఈ ఇద్దరి కాంబినేష‌న్‌లోనే సాహ‌స సామ్రాట్ మూవీ వ‌చ్చింది.బాల‌కృష్ణ ప‌క్క‌న విజ‌య‌శాంతి హీరోయిన్‌గా న‌టించారు.

ఈ చిత్రం కూడా ప్లాఫ్ అయ్యింది.ఆ త‌ర్వాత దొంగ రాముడు సినిమాను బాల‌య్య‌తో చేశాడు రాఘ‌వేంద్ర‌రావు.

ఈ మూవీలో రాధ హీరోయిన్‌గా చేసింది.ఈ సినిమా బోల్తా కొట్టింది.

వ‌రుస అప‌జ‌యాల‌తో బాల‌య్య, రాఘ‌వేంద్రరావు సినిమాల‌ను తీసేందుకు నిర్మాత‌లు భ‌య‌ప‌డ్డారు.కొంత కాలం ఇద్ద‌రి మ‌ధ్య గ్యాప్ ఏర్ప‌డింది.

Telugu Ashwini Dutt, Balakrishna, Raghavendra Rao-Telugu Stop Exclusive Top Stor

1992లో బాల‌కృష్ణ‌, రాఘ‌వేంద్రరావుతో క‌లిసి సినిమా నిర్మించేందుకు అశ్వ‌నీద‌త్ రెడీ అయ్యారు.వీరి కాంబినేష‌న్‌లో అశ్వ‌మేధ ‌యాగం రూపొందించారు.శోభ‌న్ బాబు కూడా ఈ సినిమాలో న‌టించారు.అయితే క‌థ స‌రిగా లేక‌పోవ‌డంతో ఈ సినిమా సైతం ఫెయిల్ అయ్యింది.దాదాపు 16 ఏండ్ల త‌ర్వాత బాల‌కృష్ణ హీరోగా త‌న సొంత బ్యాన‌ర్‌పై రాఘ‌వేంద్ర‌రావు నిర్మించిన చిత్ర పాండురంగ‌డు.ఎన్టీఆర్ పాండురంగ మ‌హ‌త్యానికి లేటెస్ట్ వ‌ర్షెన్ ఈ సినిమా.కే.విశ్వ‌నాథ్ ఈ సినిమాలో బాల‌య్య‌కు తండ్రిగా న‌టించారు.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో విశ్వ‌నాథ్ న‌టించిన ఒకే ఒక్క మూవీ ఇది.స్నేహ‌, ట‌బు హీరోయిన్లు.భారీ అంచ‌నాల‌తో రూపొందిన ఈ సినిమా కూడా మంచి విజ‌యం సాధించ‌లేక‌పోయింది.మొత్తంగా ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఏ సినిమా కూడా సూప‌ర్ హిట్ కాక‌పోవ‌డం విశేషం.

‌‌

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube