ఎన్టీఆర్. తెలుగు సినిమా పరిశ్రమకు అద్భుత సొబగులు అద్దిన విశ్వ విఖ్యాత నటుడు.ఆయన ప్రతి విషయాన్ని ఎంతో క్రమశిక్షణతో చూస్తారు.అలాగే కంప్లీట్ చేస్తారు.
అదే సిస్టమాటిక్ ఆయన నట వారసుడు బాలయ్యకు సైతం అలవడింది.సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరు ఒకేలా ప్రవర్తించేది.
ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
సినిమా షూటింగ్ సమయంలో సినిమాటోగ్రాఫర్స్ లైటింగ్ సెట్ చేస్తారు.
సీనిక్ మూడ్ను బట్టి లైట్ బ్యాలెన్స్ వచ్చేలా చేస్తారు.యాక్టర్లు ఎక్కడ ఉంటే వారి ముఖాలపై ఎలా లైటింగ్ వస్తుందో చూస్తారు.
ఈ టెస్టింగ్ ను ఎవరో ఒక సెట్ బాయ్ మీద చేస్తారు.కానీ ఎన్టీఆర్, బాలయ్య మాత్రం వేరే వారితో కాకుండా తామే అక్కడ నిల్చుని సహకరించేవారు.
ఎన్టీఆర్.నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర షూటింగ్ కొనసాగుతుంది.
ఆ సినిమాలో బాలక్రిష్ణ రెండు పాత్రలు చేశాడు.హరిశ్చంద్రునిగా, దుష్యంతునిగా అద్భుత నటన కనబరిచాడు.
కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రుడు మంటల్లో కాలుతున్న శవాన్ని నొక్కి పెట్టే సీన్.దాంతో యూనిట్ మంట ఏర్పాటు చేసింది.అయితే షూటింగ్ సమయంలో బాలయ్య కాలును అంటుకున్నాయి.కాలు కమిలిపోయింది.బాలయ్య బాగా ఇబ్బంది పడ్డాడు.

అక్కడ ఉన్నఎన్టీఆర్ మాత్రం షాట్ బాగా వచ్చిందని బాలయ్యను అభినందించాడు.తర్వాతి షాట్ కు రెడీ కావాలని చెప్పాడు.కాలిన గాయం బాధను అలాగే అనుభవిస్తూ.
నొప్పిని బయటకు రాకుండా తర్వాత సీన్ చేశాడు బాలయ్య.తన బాధను తండ్రికి కూడా చెప్పుకోదు.
అటు ఈ సినిమాకు కెమెరామెన్ గా బాలయ్య అన్న నందమూరి మోహన క్రిష్ణ చేశాడు.సినిమా షూటింగ్ పట్ల ఎన్టీఆర్ తో పాటు బాలయ్యకు ఉన్న కమిట్ మెంట్ కు ఈ సీన్ నిదర్శనం అని చాలా మంది అంటుంటారు.
అంతేకాదు.చెప్పిన సమయం కంటే ముందే షూటింగ్ స్పాట్ లో ఉండేవాడు ఎన్టీఆర్.
ఆయనను చూసి చాలా మంది నటీనటులు సమయపాలన పాటించే వారు.