గూగుల్ సీఈఓ 'సుందర్ పిచాయ్' ఒకప్పుడు పడ్డ కష్టాలు తెలుస్తే కన్నీళ్లొస్తాయి.! అప్పట్లో తమకు ఫ్రిజ్‌ లేదని.!

గూగుల్… ఈ సంస్థ గురించి తెలియ‌ని వారుండ‌రు అంటే అతిశ‌యోక్తి లేదు.అంత‌లా ఇది ప్ర‌సిద్ధిగాంచింది.

 Unknown Facts About Google Ceo Sundar Pichai-TeluguStop.com

గూగుల్ సెర్చ్‌, ఈ-మెయిల్‌, మ్యాప్స్, యూట్యూబ్‌… ఇలా చెప్పుకుంటూ పోతే గూగుల్ యూజ‌ర్ల‌కు అందిస్తున్న సేవ‌లు అన్నీ ఇన్నీ కావు.అలాంటి దిగ్గ‌జ సంస్థ కు సీఈవో మ‌న భార‌తీయుడు కావ‌డం మ‌నకు చాలా గ‌ర్వ కార‌ణం.

ఆయనే సుంద‌ర్ పిచాయ్.

అయితే సుందర్ గారు ఆ స్థానం కి వెళ్లడం వెనక ఎంతో కష్టం ఉంది.

అప్పట్లో తాము నిరాడంబర జీవితం గడిపేవారమని, సాదాసీదా ఇంటిలో కొంత భాగం అద్దెకు ఇచ్చి మరో భాగంలో తాము సరిపెట్టుకున్నామని చెప్పుకొచ్చారు.లివింగ్‌ రూమ్‌లో నేలపైనే తాము నిద్రించేవారమని, తాను పెద్దయ్యే క్రమంలో తీవ్ర కరువు వెంటాడిందని వెల్లడించారు.

అప్పట్లో తమకు ఫ్రిజ్‌ లేదని, ఎన్నో రోజుల తర్వాత తాము ఫ్రిజ్‌ను కొనడంతో సంబరపడిపోయామని చెప్పారు.తాను బాల్యంలో విపరీతంగా పుస్తకాలు చదివేవాడినని, స్నేహితులతో సరదాగా వీధుల్లో క్రికెట్‌ ఆడేవాడినని అప్పటి రోజుల్లో తాము ఎలాంటి చీకూచింతా లేకుండా జీవితాన్ని ఆస్వాదిం‍చామని అన్నారు.ఎన్ని ఇబ్బందులున్నా అవేమీ తమకు అవరోధాలుగా కన్పించలేదని చెప్పుకొచ్చారు.అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ చేసే ముందు పిచాయ్‌ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదివారు.

పిచాయ్‌ పెన్సిల్వేనియా వార్టన్‌ స్కూల్‌ నుంచి ఎంబీఏ డిగ్రీ పొందారు.2004లో గూగుల్‌లో క్రోమ్‌ బ్రౌజర్‌ను అభివృద్ధి చేసే బృందంలో ఒకరిగా చేరిన పిచాయ్‌ పదేళ్ల తర్వాత కంపెనీ ఉత్పత్తులు, సెర్చ్‌, యాడ్స్‌, అండ్రాయిడ్‌లతో కూడిన ప్రోడక్ట్స్‌, ప్లాట్‌ఫామ్స్‌కు ఇన్‌చార్జ్‌గా ఎదిగారు.2015లో సీఈవోగా అత్యున్నత పదవిని చేపట్టిన సుందర్‌ పిచాయ్‌ గత ఏడాది గూగుల్‌ మాతృసంస్థ అల్ఫాబెట్‌ బోర్డులో స్ధానం

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube