ఫిట్స్ తో కిందపడి కొట్టుకునే వ్యక్తి చేతిలో ఇనుప తాళాలు పెడితే ఫిట్స్ ఆగుతాయా?ఇందులో ఎంతవరకు నిజం ఉంది..   Unknown Facts About Fits     2018-10-27   14:33:50  IST  Raja

మూర్ఛ వ్యాధి… చిన్నా, పెద్దా… ఆడ, మ‌గ తేడా లేకుండా ఈ వ్యాధి వ‌స్తుంది. ఇది రావ‌డానికి కార‌ణాలు ఏమున్నా ఫిట్స్‌తో కొట్టుకుంటుంటే మాత్రం అప్పుడు ఆ వ్య‌క్తి నోట్లో నుంచి నుర‌గ వ‌స్తుంది.. అన్ని సంద‌ర్భాల్లోనూ ఇలా ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ నుర‌గ వ‌చ్చిందంటే మూర్ఛ రోగ‌మ‌నే అనుమానించాలి. అలాంటి సంద‌ర్భాల్లో కొంద‌రు అప‌స్మార‌క స్థితిలోకి కూడా వెళ్తారు. అయితే అలా మూర్ఛ వ‌చ్చిన వ్య‌క్తుల చేతిలో వెంటనే తాళాల గుత్తి,లేదంటే ఏదైనా ఇనుప వస్తువు పెడుతుంటారు..అలా చేయడం వలన మూర్ఛ ఆగుతుంద‌ని వారి భావ‌న‌. అయితే ఇందులో నిజ‌మెంత‌..? నిజంగా అలా ఇనుప తాళాలు, రాడ్‌ల‌ను పెడితే మూర్ఛ ఆగుతుందా..? ఫిట్స్ ఆగిపోతాయా..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

మూర్ఛ వ‌చ్చిన‌ప్పుడు ఆ వ్యక్తుల చేతిలో ఇనుప తాళాలు, రాడ్ల‌ను పెట్టడం వలన, అది ఎంత మాత్రం ప్ర‌భావం చూపింద‌ని చాలామంది వైధ్యులు చెప్పే మాట.. మూర్ఛ‌ను ఆపే శ‌క్తి ఇనుప తాళాలు, రాడ్ల‌కు, ఇత‌ర ఇనుప వ‌స్తుల‌కు ఉండ‌ద‌ట‌. అయితే ఎప్పుడు, ఎవ‌రికి మూర్ఛ వ‌చ్చినా అది 2 నుంచి 5 నిమిషాల లోపే ఉంటుంది. ఆ లోపు వారంత‌ట వారే సాధార‌ణ స్థితికి వ‌చ్చేస్తార‌ట‌. ఈ క్ర‌మంలో వారి చేతిలో ఇనుప తాళాలు, రాడ్ల‌ను పెట్టినా, పెట్ట‌కున్నా ఫ‌లితం ఉండ‌ద‌ని, అయితే అలా పెట్టినా, ఎలాగూ కొంత సేప‌టికి సాధార‌ణ స్థితికి చేరుకుంటారు కనుక‌, చాలా మంది ఇనుప వ‌స్తువులు ప‌నిచేశాయ‌ని భావిస్తారు. కానీ ఇందులో ఎంత మాత్రం నిజం లేదంటున్నారు న్యూరో స‌ర్జ‌న్ నిపుణులు.

Unknown Facts About Fits-

అయితే మూర్ఛ వ‌చ్చిన‌ప్పుడు అలాంటి వ్య‌క్తుల ప‌ట్ల కొన్ని జాగ్ర‌త్త‌లు మాత్రం క‌చ్చితంగా తీసుకోవాల‌ని వైద్యులు చెబుతున్నారు. అవేమిటంటే… మూర్ఛ వ‌చ్చిన రోగిని నేల‌పై పడుకోబెట్టాలి. ఫిట్స్‌తో కొట్టుకుంటూ అటు ఇటు బాగా వేగంగా క‌దిలినా, క‌ద‌ల‌నివ్వాలి. కానీ వారి చ‌ర్య‌ల‌ను ఆప‌కూడ‌దు. ఒక వేళ ఆపితే వారికి స‌డెన్ అటాక్ వ‌చ్చేందుకు అవకాశం ఉంటుంద‌ట‌. అదేవిధంగా మూర్ఛ వ‌చ్చిన రోగి నోట్లో ఎలాంటి వ‌స్తువుల‌ను పెట్ట‌కూడదు. వాంతికి అయితే చేసుకోనివ్వాలి..మూర్చ వచ్చి కింద పడి కొట్టుకుంటున్న వ్యక్తి చుట్టూ గాలి ఆడకుండా జనం మూగకూడదు. త‌గినంత గాలి ఆడేలా చూడాలి. వెంట‌నే హాస్పటల్ కి తీసుకెళ్లాలి.

2 Attachments