ఆర్.ఎక్స్.100 హీరోయిన్ పాయల్ రాజపుట్ ఎవరి కూతురో తెలుసా.? ఆమె తల్లి కూడా ఓ నటి.!

తెలుగులో లేటెస్ట్ గా రిలీజ్ అయిన RX100 మూవీలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోయటమే కాదు మతి పోయేలా లిప్ లాకులు చేసింది పాయల్ రాజపుత్.తొలి సినిమాతోనే సంచలనం సృష్టించిన ఈ ఉత్తరాది భామ టాలీవుడ్ లో ఒక్క సినిమాతోనే క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

 Unknown Facts About Facts About Payal Rajput-TeluguStop.com

అసలు ఈ సినిమా ట్రైలర్ తోనే ఆడియన్స్ పిచ్చెక్కి పోయారంటే అతిశయోక్తి కాదు.అర్జున్ రెడ్డి లో ఒకటి రెండు లిప్ లాకులకే అబ్బా అనుకున్నారు.RX100 మూవీలో మోతాదుకు మించిన సీనులతో పాయల్ రాజపుత్ రగిల్చిన వేడి అంతా ఇంతా కాదు.రివ్యూలలో సైతం పాయల్ కే మార్కులు వేస్తున్నారు సినీ క్రిటిక్స్.దాన్ని బట్టే అమ్మడు ఈ స్థాయిలో బోల్డ్ గా యాక్ట్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు.28 ఏళ్ల పాయల్ రాజపుత్ కి టాలీవుడ్లో ఇది తొలి చిత్రమే.

పాయల్ స్వస్థలం హర్యానాలోని ఫరీదాబాద్.1990 జులై 30 న జన్మించింది.తల్లిదండ్రులు మధ్య తరగతి వ్యక్తులు.ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన పాయల్ నటనపై ఆసక్తితో యాక్టింగ్ కోర్సులో డిప్లొమా చేసింది.మొదట టీవీ సీరియల్స్ లో ట్రై చేసిన ఈ హర్యానా బేబీ సప్నోస్ బరోనైనా అనే సీరియల్ లో నటించింది.ఈ సీరియల్ స్టార్ ప్లస్ ఛానెల్ లో ప్రసారమైంది.

ఆ తరువాత మహాకుంబ్ అనే ఫాంటసీ బేస్ సీరియల్ లో మాయ పేరుతో అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇది ఇలా ఉండగా ఈమె ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి చాలామందికి తెలీదు.

ఆమె తల్లి కొన్ని సీరియల్స్ లో నటించారు.సైడ్ యాక్టర్ గా నటించడం వలన తగిన గుర్తింపు రాలేదు.

దీంతో తన కూతుర్ని ఎలాగైనా మంచి హీరోయిన్ ని చేయాలని నిర్ణయించుకుంది.నిజానికి ఆర్ ఎక్స్ 100 కథ చెబితే పాయల్ రాజ్ పుత్ ఒప్పుకోలేదట.

దీంతో తల్లి ధైర్యం చెప్పి, ఏమీ కాదు కథ బాగుంది, ఖచ్చితంగా హిట్ అవుతుంది అని ఎంకరేజ్ చేసింది.సినిమా వద్దనుకుంటే ఇంత గొప్ప విజయం అందుకునే ఛాన్స్ మిస్సయ్యేది.

ఏది ఏమైనా ఆర్ ఎక్స్ 100 సక్సెస్ తో దూసుకుపోవడం తో అందరిలో ఆనందం వెల్లివిరుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube