అమెరికాలో కూడా ఇలాంటి పట్టణాలు ఉన్నాయంటే మీరు ఖచ్చితంగా నమ్మరేమో.. కాని ఇది నిజం  

Unknown Facts About Escobares People Lifestyle -

పంచంలో అత్యంత ధనిక దేశం అనగానే ఠక్కున అంతా చెప్పే పేరు అమెరికా.అక్కడ అడుకునే వారు కూడా కార్లలో తిరుగుతారు అంటూ మన వద్ద అనుకుంటూ ఉంటారు.

Unknown Facts About Escobares People Lifestyle

అమెరికాలో అత్యధికులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు అని అంతా అనుకుంటారు.కాని అమెరికాలో ఒక పట్టణం మాత్రం చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది.

ఆ పటణంలోని ప్రజలు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు.అందుకు ప్రధాన కారణం సరైన ఉపాది అక్కడ లేకపోవడేమ అంటూ స్వయంగా అమెరికా ప్రభుత్వం నిర్థారించింది.

అమెరికాలో కూడా ఇలాంటి పట్టణాలు ఉన్నాయంటే మీరు ఖచ్చితంగా నమ్మరేమో.. కాని ఇది నిజం-General-Telugu-Telugu Tollywood Photo Image

అమెరికాలోని ఇస్కోబారెస్‌ అనే పట్టణంలో దాదాపు అయిదు వేల మంది జనాబా ఉంటారు.అందులో 62 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉండి అత్యంత కడు పేదరికంను అనుభవిస్తున్నారు.

వారు తినడానికి కనీసం తిండి కూడా లభించడం లేదట.ఇస్కోబారెస్‌ పట్టణంలో ఉపాదికి సంబంధించిన ఎలాంటి వసతులు లేవు.

అందుకే ఇక్కడి నుండి పెద్ద ఎత్తున జనాలు బయటకు వెళ్తున్నారని స్థానికులు అంటున్నారు.అమెరికాలో ఇలాంటి ఒక పట్టణం ఉందని పెద్దగా తెలియదు.

అక్కడ ఉండేందుకు ఇల్లులు కూడా సరిగా లేని వారు ఉన్నారు.కొందరు రోడ్డుపై రేకుల షెడ్డులు వేసుకుని, మరికొందరు పాడుబడ్డ కంటైనర్స్‌ను ఇల్లులుగా వాడుకుంటూ ఉంటున్నారు.

తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆ పట్టణంలో నేరాలు కూడా అధికంగా జరుగుతాయట.తిండి కోసమే ఎక్కువగా నేరాలు జరుగుతున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.అక్కడ విధులు నిర్వర్తించేందుకు పోలీసులు మరియు ఇతర ప్రభుత్వ అధికారులు సైతం ఆసక్తి చూపడం లేదని, అక్కడి వారి పరిస్థితి ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇలాగే ఉంటుందని తాజాగా ఒక ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ వెలువరిచిన కథనంలో పేర్కొనడం జరగింది.అమెరికాలో ఇలాంటి ఒక పట్టణం ఉంది అంటే మీరు నమ్మలేక పోతున్నారు కదా

.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Unknown Facts About Escobares People Lifestyle- Related....