ఆ సీరియల్ హీరోయిన్ స్టార్ హీరోయిన్లకి డబ్బింగ్ చెప్పి ఎన్నో అవార్డ్స్ అందుకుంది.! ఆమె భర్త కూడా సీరియల్స్ లో.!  

Unknown Facts About Dubbing Artist Shilpa-

వదల బొమ్మాలి…వదలా అని అరుందతి సినిమాలో సోనూసూద్ వాయిస్ అందరిని ఆకట్టుకుంది.సోనూసూద్ నటనకు ఎన్ని మార్క్స్ పడ్డాయో,రవిశంకర్ వాయిస్ కి కూడా అన్ని మార్క్స్ పడ్డాయి.

Unknown Facts About Dubbing Artist Shilpa-

సినిమా వచ్చి ఏడేనిమిదేండ్లయినా ఇప్పటికి ఆ వాయిస్ ని ఎవరూ మర్చిపోలేదు.మరి అదే సినిమాలో వదల బొమ్మాలి వదలా అనే డైలాగ్ వచ్చినప్పుడు నువ్ నన్ను ఏం చేయలేవురా అని అనుష్క పవర్ఫుల్ గా చెప్పిన డైలాగ్ కూడా ఎవరూ మర్చిపోలేదు.

కానీ ఆ వాయిస్ ఎవరిది.కేవలం ఆ వాయిస్ మాత్రమే కాదు సౌందర్య,ఆమని ఇంకా మరికొంత మంది హీరోయన్ల నటన వెనుక ఉన్న గొంతు అలనాటి బుల్లితెర నటి శిల్ప ది.

శిల్ప గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.

శిల్ప మొదట దూరదర్శన్ లో సీరియల్స్ లో నటించేది.ఆ తరవాత సినిమాలలో పర బాషా నటులకు డబ్బింగ్ చెప్పటం ప్రారంభించింది.సౌందర్య నటించిన ప్రతి సినిమాకి శిల్ప డబ్బింగ్ చెప్పింది.

సౌందర్య కూడా శిల్ప చేత డబ్బింగ్ చెప్పించమని మరీ చెప్పేవారట.అలాగే అనుష్క ప్రతి సినిమాకి శిల్ప డబ్బింగ్ చెప్పేది.

ఒక పాత్ర పండాలంటే ఆర్టిస్ట్ హావభావాలతో పాటు డబ్బింగ్ కూడా ముఖ్యమే.శిల్ప డబ్బింగ్ అనుష్క పాత్రలకు ప్రాణం పోస్తుందంటే అతిశయోక్తి కాదేమో.

అలాంటి శిల్ప ప్రస్థానం ఎలా ప్రారంభం అయిందంటే.శిల్ప చదువుకొనే రోజుల్లో తల్లి ప్రోత్సాహంతో టెలివిజన్ సీరియల్స్ లో నటించేది.

ఆ తర్వాత మెల్లిమెల్లిగా డబ్బింగ్ వైపు అడుగుపెట్టారు.మొదట్లో సైడ్ క్యారెక్టర్స్ కి డబ్బింగ్ చెప్పిన శిల్ప అశ్విని నాచప్ప నటించిన అశ్విని సినిమాలో అశ్విని క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పడంతో మెయిన్ క్యారెక్టర్స్ కి డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశారు.

అప్పుడు మొదలైన ప్రయాణం నేటికి కొనసాగుతుంది.భర్త మహర్షి రాఘవ.అతను కూడా బుల్లితెర నటుడే.తన తొలిసినిమా మహర్శినే తన పేరు ముందు చేర్చుకున్న రాఘవనే ,శిల్ప భర్త.

వీరిది ప్రేమ వివాహం.వీరికి ఒక కుమారుడు రుద్రాక్ష్.అమెరికాలో బిబిఎ చదువుతున్నాడు.

ఎంత బాగా నటించినప్పటికీ వాయిస్ సరిగా లేకపోతే పాత్ర తేలిపోతుంది.ముఖ్యంగా వేరే భాషల నుండి వచ్చే హీరోయిన్సే టాలివుడ్లో ఎక్కువగా ఉన్నారు అలాంటప్పుడు వారికి వాయిస్ చెప్పాల్సిన బాద్యత డబ్బింగ్ ఆర్టిష్ట్ లపైన ఉంటుంది.తొలితరం టెలివిజన్ తారల్లో శిల్ప ఒకరు.మొట్టమొదటి సీరియల్ హీరోయిన్ కూడా ఈవిడే…సౌందర్య ప్రతి సినిమాకు వాయిస్ అందించింది శిల్పనే.నాకు డబ్బింగ్ చెప్తే శిల్పనే చెప్పాలి లేదంటే మరెవరూ వద్దు అని సౌందర్య అనేవారంటే ఆమె వాయిస్ కి ఉన్న ప్రత్యేకత అర్దం చేసుకోవచ్చు.

అనుష్క నటించిన ప్రతి సినిమాలో కూడా అనుష్క వాయిస్ శిల్పదే.ఇప్పటివరకూ ఎవరూ తీసుకోనన్ని నంది అవార్డులు శిల్ప అందుకున్నారు.

నటిగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పది నందులు తీసుకున్న ఘనత ఆమెది.నటిగా ఐదు నందులు,డబ్బింగ్ ఆర్టిస్టుగా ఐదు నందులు సొంతం చేసుకున్నారు.

ఇప్పటివరకూ వెయ్యి సినిమాల వరకు డబ్బింగ్ చెప్పారు శిల్ప.

తాజా వార్తలు