కరుణానిధి గారి గురించి చాలా మందికి తెలియని ఆసక్తికర విషయాలివే.! అసలు పేరు ఏంటంటే.?

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణంతో.ఆయన అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు.

 Unknown Facts About Dmk Chief M Karunanidhi Journey-TeluguStop.com

గత కొద్దిరోజులుగా కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు సాయంత్రం తుది శ్వాస విడిచారు.ఆయన గురించి చాలా మందికి తెలియని ఆసక్తికర విషయాలు ఇవే.!

పుట్టింది ఒక సామాన్య కుటుంబంలో అయినా కరుణానిధి ఎదిగిన తీరు అద్భుతం, అపూర్వం.కరుణకు తల్లిదండ్రులు పెట్టిన పేరు ‘దక్షిణామూర్తి’.

తన పద్నాలవయేటే దక్షిణామూర్తిలో విప్లవ భావాలు వెలుగు చూశాయి.ఆ భావాలే ఆయనను పేరును మార్చాయి.

తల్లిదండ్రులు పెట్టిన పేరును సైతం మార్చేసుకుని ‘కరుణానిధి’ అయ్యారు.

4 సంవత్సరాల వయసులో నాటకరంగలోకి అడుగుపెట్టిన కరుణానిధి.అనేక నాటకాల్లో నటించారు.కవిత్వం రాయడంలోనూ ఆయనకు మంచి ప్రావీణ్యం ఉంది.

వివాహానంతరం నాటక రచయితగా జీవితాన్ని ప్రారంభించారు.ఆ నాటకాల్లోనూ ఆయన నటించారు.

కొంతకాలానికి ప్రసిద్ధ చలనచిత్ర నిర్మాణ సంస్థ ‘జూపిటర్‌ పిక్చర్స్‌’ నుంచి పిలుపు రావడంతో అందులో స్క్రిప్ట్‌ రైటర్‌గా కొత్త జీవితాన్ని కరుణానిధి ప్రారంభించారు.ఆయన 39 సినిమాలకు స్క్రిప్ట్‌ రైటర్‌గా పనిచేశారు.

కరుణానిధి తొలిసారిగా 1947లో ‘రాజకుమారి’ అనే చిత్రానికి సంభాషణలు రాశారు.ఇది ఎంజీఆర్‌ ప్రధాన పాత్రలో నటించిన తొలి సినిమా కావడం విశేషం.తర్వాత ‘అభిమన్యు’ చిత్రానికి కరుణానిధి మాటలు రాశారు.1952లో వచ్చిన ‘పరాశక్తి’ సినిమాతో స్క్రిప్ట్ రైటర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు.ఆ సినిమా నటుడు శివాజీ గణేశన్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది.ఆ తర్వాత ‘మనోహర‌’తో కరుణానిధి పేరు మార్మోగిపోయింది.దీంతో ఆయన వరుసగా ‘మంత్రి కుమారి’, ‘పుదైయల్‌’, ‘పూంబుహార్‌’, ‘నేతిక్కుదండనై’, ‘చట్టం ఒరు విలయాట్టు’, ‘పాసం పరవైగల్‌’, ‘పొరుత్తుపొదుం’ తదితర చిత్రాలకు రచయితగా పనిచేశారు.

కరుణానిధి చివరిసారిగా 2011లో త్యాగరాజన్‌ దర్శకత్వం వహించిన ‘పొన్నార్‌ శంకర్‌’ చిత్రానికి కథను అందించారు.ఈ చిత్రంలో ప్రశాంత్‌ కథానాయకుడిగా నటించారు.ఈ విధంగా ఆయన తన సినీజీవితంలో మొత్తం 39 సినిమాలకు స్క్రిప్ట్‌ను అందించి.

సినీ పరిశ్రమకు తన సేవలను అందించారు.

అటు రాతలో, ఇటు చేతతో కరుణానిధి తమిళనాట వైతాళికుడిగా మారారు.

ద్రవిడ ఉద్యమంలో భాగస్వామి అయ్యి, పోరాటకర్తగా ప్రత్యేక ప్రాధాన్యతను సొంతం చేసుకుని, నాయకుడిగా ఎదిగారు కరుణ.ద్రవిడ ఉద్యమంలో కరుణానిధి పాత్ర అనిర్వచనీయమైనది.

ఆ ఉద్యమంలో నాటి యూత్‌కు ఒక ఐకాన్‌గా మారారు కరుణ.ద్రవిడ ఉద్యమ నేత అన్నాదురై ప్రీతిపాత్రుడయ్యారు.

అన్నా వారసత్వానికి తగిన నేతగా నిలిచారు.అన్నా అనంతరం.

ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే) బాధ్యతలు అందుకున్నారు.పార్టీని సమర్థవంతమైన నడిపిన నేతగా, తమిళనాడును అత్యధిక కాలం ఏలిన ముఖ్యమంత్రిగా కరుణ చరిత్ర సృష్టించారు.

తమిళనాడు చరిత్రలో కరుణానిధికి ప్రత్యేక పాత్ర ఉందని చెప్పడమే కాదు, తమిళనాడు చరిత్ర అంతా కరుణానిధి ప్రస్థానం కనిపిస్తుందని అనడంలో అతిశయోక్తి లేదు.ఐదు సార్లు తమిళనాడు ముఖ్యమంత్రి, పది సార్లు డీఎంకే అధ్యక్ష పదవిని అధిష్టించిన నేత.ఇదీ కరుణానిధి ప్రస్థానం.94 యేళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు.తమిళులను కన్నీటి సాగరంలో ముంచెత్తి భౌతికంగా దూరం అయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube