ఇన్ని నెలల తర్వాత బయటపడ్డ కామెడియన్ వివేక్ మృతి రహస్యం

Unknown Facts About Comedian Vivek Death

కొద్ది నెలల క్రితం తమిళ స్టార్ కమెడియన్ వివేక్ కన్నుమూశాడు.గుండె సంబంధ ఇబ్బందితో ఆయన చనిపోయాడు.

 Unknown Facts About Comedian Vivek Death-TeluguStop.com

ఆయన మృతి రకరకాల వాదనలు వినిపించాయి.ఆయన కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం మూలంగానే చనిపోయిన్టుల వదంతులు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఆయన చనిపోవడానికి గల కారణాలను తెలుసుకునేందుకు కేంద్ర ఆరోగ్య‌-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ‌ ఓ కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీ నివేదికలో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

 Unknown Facts About Comedian Vivek Death-ఇన్ని నెలల తర్వాత బయటపడ్డ కామెడియన్ వివేక్ మృతి రహస్యం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వివేక్ మృతికీ, కొవిడ్ వాక్సిన్‌కూ సంబంధం లేద‌ని ఇమ్యునైజేష‌న్ విభాగం క‌నుగొంది.కొవిడ్‌ వాక్సిన్ తీసుకున్న రెండు రోజుల త‌ర్వాత వివేక్ క‌న్నుమూశారు.

ఈ ఏడాది ఏప్రిల్ 17న ఆయన చనిపోయాడు.

వివేక్ మ‌ర‌ణానికి అసలు కార‌ణం Acute myocardial infraction with cardiogenic shock with ventricular fibrillation in a known cause of hypertension అని కేంద్ర కమిటీ వెల్లడించింది.

అంటే గుండెకు ర‌క్తాన్ని పంపించే హృద‌య ధ‌మ‌నిలో ఏర్ప‌డే సమస్యను అక్యూట్ మ‌యోకార్డియ‌ల్ ఇన్‌ఫ్రాక్ష‌న్ అని అంటారు.కార్డియోజెనిక్ షాక్ అంటే గుండె ఆక‌స్మికంగా ర‌క్తాన్ని పంపడాన్ని నిలిపివేయడం.

వెంట్రిక్యులార్ ఫైబ్రిలేష‌న్ అంటే.అసాధార‌ణ హృద‌య స్పందన.

దీని మూలంగా గుండెలోని కింది గదులు మెలితిరుగుతాయి.ఈ కారణంగా గుండె తగినంత రక్తాన్ని నాళాలకు పంపించదు.

దీంతో గుండె ఆగి మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది.వివేక్ విషయంలోనూ అదే జరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన దర్యాప్తు కమిటీ తేల్చిచెప్పింది.

దీంతో వివేక్ మృతిపై ఉన్న అనేక అనుమానాలు తొలగిపోయాయి.

Telugu Acute Myocardial Infraction, Central Health Committee, Comedian Vivek, Comedian Vivek Death Report, Corona Vaccine, Heart Problem, Kollywood, Tamil Comedian Vivek, Vivek Medical Report-Movie

గుండె సంబంధ సమస్యతో వివేక చెన్నైలోని సిమ్స్ ఆస్పత్రిలో కొద్ది రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు.ఆ తర్వాత నెమ్మదిగా కోలుకున్నాడు.అప్పుడే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడు.

ఇది వేసుకున్న రెండో రోజే ఆయన చనిపోయాడు.దీంతో చాలా మంది ఆయన చనిపోవడానికి కరోనా వ్యాక్సినే కారణం అని ప్రచారం చేశారు.

ప్రస్తుతం కేంద్ర కమిటీ దర్యాప్తులో ఈ విషయం వాస్తవం కాదని తేలింది.అటు సిమ్స్ డాక్టర్లు కూడా వివేక్ ఎడ‌మ వైపు ధ‌మ‌నిలో 100 శాతం బ్లాకేజ్ ఉండ‌టం వ‌ల్లే గుండె ఆగి చనిపోయినట్లు వెల్లడించారు.

#Vivek #Vivek #Kollywood #Vivek Medical #Heart Problem

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube