రాజకీయాలకు బలి అయిపోయిన వడివేలు సినిమా కెరియర్...

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది కామన్ గా వస్తూనే ఉంటాయి.కానీ నటీనటులు ఖాళీగా ఉండకుండా ఎప్పుడు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడిపాలి అని కోరుకుంటారు.

 Unknown Facts About Comedian Vadivelu-TeluguStop.com

అలా చాలామంది వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు అనే విషయం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా హీరోలతో పాటు పోటీపడి నటించే కొంత మంది కమెడియన్స్ కూడా సినిమా ఇండస్ట్రీ గా ఉంటారు అనే విషయం అందరికీ తెలిసిందే.మన దగ్గర అయితే బ్రహ్మానందం లాంటి కమెడియన్ దాదాపు హీరోతో పాటు సమానమైన క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు అని చెప్పాలి ఆయన ద్వారానే చాలా సినిమాలు హిట్ అయ్యాయి అని కూడా చెప్పుకోవచ్చు.

చాలా మంది స్టార్ హీరోల సినిమాలు సైతం బ్రహ్మానందం కామెడీ వల్ల సక్సెస్ ను సాధించాయి అనే ముద్ర కూడా జనాల దృష్టిలో కొన్ని రోజుల పాటు ఉండేది అలాగే తెలుగులో బ్రహ్మానందం తన కామెడీతో ఎంత బాగా నటిస్తాడో అలాగే తమిళ ఇండస్ట్రీలో వడివేలు కామెడీ కూడా అలాగే ఉంటుంది.ఆయన తమిళంలో చేసిన సినిమాలు తెలుగులో డబ్ అవ్వడం వల్ల మనం కూడా ఆయన కామెడీ చూస్తూ వచ్చావు మంచి ఎక్స్ ప్రెషన్స్ తో కామెడీ చేయగలిగే సత్తా ఉన్న నటుడు వడివేలు చంద్రముఖి సినిమాలో వడివేలు ఒక క్యారెక్టర్ చేయాలని రజినీకాంత్ కోరడంతో వడివేలు అప్పుడు కొంచెం బిజీగా ఉన్నాడు.

 Unknown Facts About Comedian Vadivelu-రాజకీయాలకు బలి అయిపోయిన వడివేలు సినిమా కెరియర్…-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఆయన డేట్స్ కోసం రజనీకాంత్ సైతం రెండు నెలలు వెయిట్ చేసాడు అంటే అతని నటన ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు అయితే తమిళ సినిమా ఇండస్ట్రీలో వడివేలు చాలా సంవత్సరాలపాటు కనిపించకుండా పోయాడు అసలు ఏం జరిగింది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం.

వడివేలు కమెడియన్ గా టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు విజయ్ కాంత్ సినిమా లో ఒక క్యారెక్టర్ లో నటించే అవకాశం వచ్చింది అయితే విజయ కాంత్ అప్పటికే టాప్ హీరో అవ్వడం వలన ఆయన సినిమాలో వడివేలుకు కూడా మంచి వేషం ఇచ్చారు.

ఆ సినిమాలోని ఒక సీన్ లో భాగంగా వడివేలు విజయ్ కాంత్ సీఎం అవుతాడు అని ఒక డైలాగు ఉంది దాన్ని గట్టిగా అరుస్తూ చెప్పాలని దర్శకుడు చెప్పడంతో వడివేలు కొంచెం కోపానికి వచ్చి సినిమా వేరు రాజకీయం వేరు రాజకీయాన్ని సినిమాని ఒక దాంట్లో పోల్చి ఎందుకు చూస్తున్నారు మీరు నేను ఇలా డైలాగ్ చెప్తే అపోజిషన్ పార్టీలో ఉన్న డీఎంకే అన్నాడీఎంకే పార్టీ లకు ఇబ్బంది కలుగుతుంది వారి మనోభావాలను దెబ్బ తీయాలేను అని అనడంతో చిన్న వివాదం జరిగింది.

Telugu Chandramukhi, Hero Vijay Kanth, Jayalalitha, Kollywood, Movie Career Collapse, Politics, Rajnikanth, Star Comedian, Unknown Facts, Vadivelu, Vadivelu Struggles-Telugu Stop Exclusive Top Stories

దాంతో వడివేలు తో విజయ్ కాంత్ ఒక నటుడిగా నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు కాబట్టి మేము ఏం చెప్తే అది చేయాలి అని అనడంతో డబ్బులు తీసుకుంటే కొంత మంది పేర్లు చెప్పమంటే అది చెప్తారేమో కానీ మీరు డబ్బులు ఇచ్చినంత మాత్రాన ఏది పడితే అది నేను చెప్పలేను అని అనడంతో విజయకాంత్ వడివేలు కాలర్ పట్టుకున్నాడు.దాంతో అక్కడి నుంచి వడివేలు ఇంటికి వెళ్ళిపోయాడు ఆ సినిమాలో వడివేలు లేకుండానే షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేశారు.అలా విజయ్ కాంత్ వడివేలు మధ్య వాగ్వివాదం జరిగింది ఇదిలా ఉంటే ఎలక్షన్స్ అప్పుడు విజయ్ కాంత్ కి పోటీగా పార్టీకి తరఫున ప్రచారానికి సినిమాకు సంబంధించిన వారు ఎవరు ఉన్నారు అని అపోజిషన్ పార్టీ వాళ్లు అనుకున్నప్పుడు వడివేలు తో ప్రచారం చేయించాలి అనుకొని వడివేలు ని రంగంలోకి దించారు.

వడివేలు విజయకాంత్ పైన సెటైర్లు వేస్తూ అలాగే జయలలిత పైన కూడా విపరీతమైన సెటైర్లు వేశాడు.దాంతో ఆయన స్పీచ్ లు బాగా వైరల్ అయ్యాయి ఆయన ఎక్కడా ప్రచారం చేశాడో అక్కడ జయలలిత కూడా ఓడిపోయింది.

Telugu Chandramukhi, Hero Vijay Kanth, Jayalalitha, Kollywood, Movie Career Collapse, Politics, Rajnikanth, Star Comedian, Unknown Facts, Vadivelu, Vadivelu Struggles-Telugu Stop Exclusive Top Stories

దానివల్ల జయలలిత వడివేలు అన్న మాటలను మనసులో పెట్టుకొని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తను గెలిచి సీఎం అయింది.ఆ తర్వాత డైరెక్ట్ గా నిర్మాతల మండలి దగ్గరికి వెళ్లి సినిమాలో ఎవరు ఇక మీదట వడివేలుని తీసుకోవద్దు ఒకవేళ తీసుకుంటే ఆ సినిమా అనేది సెన్సార్ పూర్తి అవ్వదు సినిమా బయటికి రాదు అని బెదిరించింది.దాంతో వడివేలు ని ఎవరు సినిమాలో పెట్టుకోలేదు ఆల్రెడీ ఆయన చేస్తున్న క్యారెక్టర్లు ఉంటే అతని కాదని వేరే ఆర్టిస్టులను పెట్టి కూడా షూట్ చేశారు అలా వడివేలు సినిమా కెరియర్ జయలలిత వల్ల మధ్యలోనే ఆగిపోయింది అని చెబుతుంటారు.మొత్తానికి మంచి కమెడియన్ గా గుర్తింపు పొందిన వడివేలు కెరియర్ అనేది ఇలా మధ్యలోనే రాజకీయాలకు బలి అవ్వడం అనేది కొంత వరకు బాధను కలిగించే విషయమే అని చెప్పాలి.

అయితే జయలలిత చనిపోయిన తర్వాత విజయ్ ఒక సినిమాలో వడివేలు కి చిన్న పాత్రని ఇచ్చాడు.

#Kollywood #Star Comedian #Chandramukhi #Rajnikanth #Politics

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు