నిజాయతి వల్ల ఎన్నో సార్లు ట్రాన్స్ ఫర్ అయిన 'కలెక్టర్ రోహిణి' గురించి ఎవరికీ తెలియని విషయాలివే.!   Unknown Facts About Collector Rohini     2018-10-13   13:56:09  IST  Sainath G

మన దేశంలో నిజాయితిగా పనిచేసే వారికి అందే సత్కారం ఏంటంటే బదిలిలు..ఎక్కడైనా తప్పు జరిగితే దాన్ని ప్రశ్నిస్తే రాజకీయ నాయకుల అండ చూసుకుని అక్కడి నుండి వారిని బదిలి చేయించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు.ఈ కోవలోకే వస్తారు కలెక్టర్ రోహిణి సింధూరి.ఈవిడ గురించి గూగుల్ లో టైప్ చేస్తే మీకు తొలుత కనిపించేది ఆవిడ ట్రాన్సపర్స్ న్యూసే..దాన్ని బట్టే ఆవిడ నిజాయితి అర్దం చేసుకోవచ్చు..ఎమ్ ఎల్ఎలు,మంత్రులు సైతం విభేదించిన ఆవిడ గురించి ఆసక్తికరమైన విషయాలు..

తల్లిదండ్రులు,కుటుంబం
అమ్మ శ్రీలక్ష్మీ, నాన్న జైపాల్ గారిది ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలోని రుద్రాక్షపల్లి గ్రామం. నిత్యం ఇంట్లో గడిపే తల్లిదండ్రుల వ్యక్తిత్వం వారి పిల్లలపై తీవ్రప్రభావం చూపెడుతుంది. రోహిణి గారిలో నిజాయితీతో కూడిన క్రమశిక్షణ అలవడడానికి గల ప్రధాన కారణం అమ్మ శ్రీలక్ష్మీ . దాదాపు 30 సంవత్సరాలుగా అమ్మ సేవారంగంలో ఉంటూ సమాజానికి ఆత్మీయతంగా ఎంతో సేవ చేసేవారు. రోహిణి గారిని అమ్మ నాన్నలు ఉన్నత చదువులు, ఉన్నత ఉద్యోగం, ఉన్నత జీవితం కోసం అమెరికా పంపాలని ఆశించారు.కాని “కలెక్టర్ అవుతానమ్మా” అని ఎంతో ఆశగా కూతురు కోరిన కోరికను తల్లిదండ్రులు కూడా అంతే ఆనందంతో ఒప్పుకున్నారు.. వెంటనే డిల్లీలోని కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేసారు.

Unknown Facts About Collector Rohini-

ప్రమాదం జరిగినా సడలని ఆత్మవిశ్వాసం
అన్ని అనుకున్నట్టుగానే జరుగితే అది జీవితం ఎందుకు అవుతుంది… మంచి ప్రణాళికలతో ఐ.ఏ.ఎస్ కావడమే ముందున్న లక్ష్యం అనుకుంటున్న తరుణంలో రోహిణి గారికి యాక్సిడెంట్ జరిగింది.ఢిల్లీ లో ఓరోజు రోడ్ క్రాస్ చేస్తుండగా అటుగా వస్తున్న కారు రోహిణీ గారిని ఢీ కొట్టింది. ఈ విషయం తెలుసుకుని హుటాహుటిగా ఢిల్లీ వెళ్ళి చూశాక పేరెంట్స్ మరింత బాధ పడ్డారు ఎందుకంటే తగిలిన గాయాలు చిన్నవేం కాదు. కలెక్టర్ అవ్వాలనే తపన ఏ స్థాయిలో ఉందోనని తెలిసింది కూడా ఆ సందర్భంలోనే తెలిసింది…ఆ తర్వాతనే వారికి రోహిణి మరింత కొత్తగా కనిపించింది. గాయలవ్వడంతో బెడ్ మీద పడుకుని చదువుకోవడం నుండి, వీల్ ఛైయిర్ పై కూర్చిని చదువుకోవడం ఆఖరికి వాష్ రూం గోడలపై రాస్తూ కూడా సివిల్స్ ప్రిపేర్ అయ్యారు రోహిణి.సంకల్పం ఉంటే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా అనుకూలంగా మార్చుకోవచ్చు అనడానికి రోహిణిగారే ప్రత్యక్ష సాక్ష్యం.

Unknown Facts About Collector Rohini-

అవహేళనల మధ్య సాకారం అయిన కల
కలెక్టర్ అవ్వగలను అనే నమ్మకం రోహిణి గారికి, పేరెంట్స్ కు ఉన్నా గాని ఇతర బంధువులు మాత్రం హేళనగా మాట్లాడేవారు. అందంగా ఉండడం వల్ల బంధువులు నుండి పెళ్ళి సంబంధాలు అడిగేవారు కాని,తన లక్ష్యాన్ని పట్టించుకునేవారు చాలా తక్కువమంది.కాని రోహిణి గారు ఇవ్వేమి ఆలోచించకుండా అనుకున్నట్టుగానే ఐ.ఏ.ఎస్ కలను నిజం చేసుకున్నారు.

Unknown Facts About Collector Rohini-

ట్రాన్స్ఫర్ పై వెనక్కి తగ్గిన ప్రభుత్వం..కారణం??
ప్రభుత్వం ఏ బాధ్యతలు అందించినా గాని తనలో, సాటి అధికారులలో ఏ తప్పు, నిర్లక్ష్యం దొర్లకుండా పనిచేసేవారు. ఈ కోవలోనే సామన్య ప్రజానీకం నుండి కేంద్ర ప్రభుత్వం వరకు ఎంతోమంది మన్ననలు అందుకున్నారు. ప్రస్తుతం కర్ణాటక హసన్ జిల్లా డీసీగా బాధ్యతలు నిర్వహిస్తుండగా కొన్ని సమస్యలపై మంత్రుల నుండి విభేదాలు వచ్చాయి.. “రోహిణి ఇక్కడ ఉంటే మేము ఆశించిన పనులు జరగవని భావించి” మంత్రులు రోహిణి గారిని ట్రాన్స్ ఫర్ చేయాలని భావించారు.. ఐతే హసన్ జిల్లా నుండి రోహిణి గారు వెళ్ళితే మళ్ళి పాత పరిస్థితులే వస్తాయని భావించిన అక్కడి ప్రజలు రోడ్డు మీదకు వచ్చి రోహిణి గారిని ట్రాన్స్ ఫర్ చేయడానికి వీలులేదు అని తమ సొంత సమస్యలా ఉద్యమం చేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రజలు తిట్టుకునే అధికారులు ఎంతోమంది ఉంటారు కాని అధికారుల కోసమే ఇలా ప్రేమతో ఉద్యమాలు చేయించుకునే వారు కొందరే ఉంటారు..