ఆదర్శం : ఇటీవల సివిల్స్‌ ఫలితాల్లో 93 ర్యాంకు సాధించిన ప్రదీప్‌ తండ్రి ఏం చేస్తాడో తెలిస్తే సెల్యూట్‌ చేస్తారు  

Unknown Facts About Civils 93 Ranker Pradeep Father-

తాజాగా యూపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో 93వ ర్యాంకును సాధించిన కుర్రాడు ప్రదీప్‌ గురించి దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా చర్చించుకుంటుంది.ఎందుకంటే అతడు చాలా చిన్న వయసు కుర్రాడు అవ్వడంతో పాటు, అతడి కుటుంబ బ్యాక్‌ గ్రౌండ్‌ కూడా చాలా కింది స్థాయిలో ఉంది.

Unknown Facts About Civils 93 Ranker Pradeep Father-

అందుకే ప్రస్తుతం దేశంలోనే ప్రదీప్‌ గురించి హాట్‌ టాపిక్‌ అయ్యింది.బికామ్‌ చదివిన కుర్రాడు ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఏదేని జాబ్‌ చేయాలని భావించాడు.

అయితే పెట్రోల్‌ బంక్‌ లో పని చేసే ప్రదీప్‌ తండ్రి మనోజ్‌ కుమార్‌ మాత్రం తన కొడుకు కోరికను తెలుసుకున్నాడు.

Unknown Facts About Civils 93 Ranker Pradeep Father-

సివిల్స్‌ కోచింగ్‌కు వెళ్లాలని ఉన్న అతడి కోరిక నెరవేర్చేందుకు ఉంటున్న ఇంటిని అమ్మేశాడు.ఢిల్లీలోని ప్రముఖ కోచింగ్‌ సెంటర్‌లో జాయిన్‌ చేశాడు.అయితే అప్పటికి డబ్బులు తీవ్ర ఇబ్బందులు ఉన్న కారణంగా మరిన్ని అప్పులు చేశాడు.

తన తండ్రి పడుతున్న కష్టం చూసిన ప్రదీప్‌ రోజుకు 15 నుండి 20 గంటల పాటు చదివేదట.తండ్రి పడ్డ కష్టంకు ఫలితం ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రదీప్‌ చాలా కష్టపడి అత్యుత్తమ ర్యాంకును సాధించాడు.

ప్రదీప్‌కు వచ్చిన ర్యాంకుతో ఐఏఎస్‌ అవ్వబోతున్నాడు.

ఈ సందర్బంగా ఆయన తండ్రి మనోజ్‌ కుమార్‌ మాట్లాడుతూ.తన కొడుకుల భవిష్యత్తు గురించి చాలా కలలు కన్నాను.నేను వారికి మంచి చదువు ఇవ్వాలని భావించాను.అందుకే వారి కోసం ఇంటిని అమ్మేందుకు అయినా సిద్ద పడ్డాను.ఇప్పుడు ప్రదీప్‌ సివిల్స్‌లో మంచి ర్యాంకు దక్కించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

అతడు పడ్డ కష్టంకు ప్రతిఫలం దక్కింది.నా కొడుకును చూసి గర్వపడుతున్నాను.పిల్లలను చదివించడం ప్రతి ఒక్కరి బాధ్యత.వారి కోసం కష్టపడుతున్నామని అనుకోకుండా, వారి అభిరుచిని తెలుసుకుని చదివించడం మంచిది అంటూ పేర్కొన్నారు.

ప్రదీప్‌ చిన్న వయసులోనే యూపీఎస్సీకి అర్హత సాధించి అరుదైన వ్యక్తిగా నిలిచాడు.

.

తాజా వార్తలు

Unknown Facts About Civils 93 Ranker Pradeep Father- Related....