చైనా గురించి కొన్ని వాస్తవాలు     2017-10-06   22:02:58  IST  Raghu V

1. ఫార్చ్యూన్ కుకీలు సంప్రదాయ చైనీస్ కస్టమ్ కాదు. వీటిని 1900 సంవత్సరంలో సాన్ ఫ్రాన్సిస్కో లో కనుగొన్నారు.
2. చైనా ఒక సంవత్సరానికి 45 బిలియన్ల చాప్ స్టిక్లను ఉపయోగిస్తుంది.
3. వరల్డ్స్ బిగ్గెస్ట్ మాల్ చైనా లో ఉన్నది. కానీ 99% ఖాళీగా ఉంటుంది.
4. 2009 నుండి ఫేస్బుక్, ట్విట్టర్ మరియు న్యూ యార్క్ టైమ్స్ వంటి వాటిని చైనా లో బ్లాక్ చేసారు.
5. ప్రపంచంలో మొట్టమొదటి సారిగా 1,400 సంవత్సరాల క్రితం చైనాలో కాగితం డబ్బును రూపొందించారు.
6. చైనాలో ఇప్పటికీ సుమారు35 మిలియన్లకు పైగా ప్రజలు గుహలలో నివసిస్తున్నారు.
7. చైనాలో దాదాపుగా 700 మిలియన్ మంది ప్రజలు కలుషితమైన నీటిని త్రాగుతున్నారు.
8. శాన్ ఫ్రాన్సిస్కో కి వాయు కాలుష్యం మూడు వంతులు చైనా నుండి వస్తుంది.
9. 2010 లో చైనా లో సాఫ్ట్ వేర్స్ ని 78 శాతం మంది దొంగతనంగా ఇన్స్టాల్ చేసుకున్నారు.
10. చైనాలో ప్రతి 30 సెకన్లకు లోపంతో ఉన్న శిశువు జన్మిస్తుంది.
11. టేబుల్ టెన్నిస్ చైనా యొక్క జాతీయ క్రీడ.
12. ప్లే స్టేషన్ చైనాలో చట్ట విరుద్ధంగా ఉంది.
13. వాల్మార్ట్ చైనాలో ఆరవ-అతిపెద్ద ఎగుమతి మార్కెట్ గా ఉంది.
14. 2020 నాటికి, చైనాలో 20 మిలియన్ నుంచి 30 మిలియన్ మధ్య పురుషులు ఉంటారు. వారికి భార్యలు దొరకటం చాలా కష్టం.
15. చైనా లో సౌందర్య ఉత్పత్తులను జంతువులు మీద పరీక్షిస్తారు. అయితే ఐరోపాలో దీనిని నిషేదించారు.
16. చైనాలో బ్రా అధ్యయనాలు ప్రధానంగా చెయ్యవచ్చు.
17. చైనాలో ప్రతి ఐదు రోజులకు ఒకసారి ఒక కొత్త ఆకాశసౌధంను నిర్మిస్తున్నారు. 18. చైనాలో ఇంటర్నెట్ వ్యసనపరులకు చికిత్స శిబిరాలు ఉన్నాయి.
19. యూరప్ మొత్తం కంటే చైనాలో ఎక్కువ మంది ఆదివారం చర్చికి వెళతారు.
20. చైనాలో ఇతర జంతువులు లాగా పెంపుడు జంతువులకు రంగు వేసే ఒక ట్రెండ్ ఉంది.
21. ప్రతి సంవత్సరం దాదాపు నాలుగు మిలియన్ల పిల్లులను ఒక రుచికరమైన ఆహారంగా తింటున్నారు.
22. ప్రపంచంలో సగం పందులు చైనాలోనే నివసిస్తున్నాయి.