క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన "రవిప్రకాష్" గురించి ఈ షాకింగ్ నిజాలు మీకు తెలుసా.?

డాక్టర్ అవ్వబోయి ఆక్టర్ అయ్యా అని చాలా మంది సినిమా ఆర్టిస్టులు అంటుంటారు.అదేకోవకి చెందారు మన తెలుగు సినిమా నటుడు ఒకరు,.

 Unknown Facts About Character Artist Ravi Prakash-TeluguStop.com

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో పాత్రల్లో నటించిన ఆ నటుడు డాక్టర్ అవ్వబోయి ఆక్టర్ అయ్యారంట.ఇప్పటివరకు దాదాపు 200 చిత్రాల్లో నటించారు ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్.

అతను ఎవరా అనుకుంటున్నారా.? మీకోసం క్లూ…అతడు సినిమాలో ప్రకాష్ రాజ్ పక్కనే ఉంటాడు.అతనే మన రవిప్రకాష్ గారు.

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శుక్రవారం ఆయన కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.ఈసందర్భంగా స్థానిక మీడియాతో కొంతసేపు మాట్లాడారు.విశాఖ మా సొంత ఊరని, లాసెన్స్‌బే కాలనీలో మా తల్లిదండ్రులు ఉంటున్నారని తెలిపారు.

విద్యాభ్యాసం అంతా విశాలో జరిగిందన్నారు.విశాఖ వేలీ స్కూల్‌లో పన్నెండో తరగతి వరకు చదివానని, ఆ తర్వాత ఎంబీబీఎస్‌ మాస్కోలో చేశానని తెలిపారు.

కొంతకాలం హైదరాబాద్‌లో ప్రాక్టిస్‌ చేశానన్నారు.ఆ తర్వాత స్నేహితులు, బంధువులు చెబితే అనుకోకుండానే సినీ రంగ ప్రవేశం చేశానన్నారు.

అలా 2000 సంవత్సరంలో తేజ దర్శకత్వంలో వచ్చిన శుభవేళ చిత్రం ద్వారా పరిచయం అయ్యానన్నారు.అప్పటి నుంచి సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం ప్రేక్షకులు అందించారన్నారు.ఇప్పటివరకు దాదాపు 200 చిత్రాల్లో నటించానన్నారు.ప్రస్తుతం సమంత, ఆదిపినిశెట్టి జంటగా నటిస్తున్న యూటర్న్‌ సినిమాలోను, తాప్సి, ఆది పినిశెట్టి జంటగా నటిస్తున్న నీవెవరు అనే చిత్రంలోను, శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజే హీరోగా నటిస్తున్న అమర్‌ అక్బర్‌ ఆంథోని చిత్రంలోనూ నటిస్తున్నాన్నారు.

క్రిష్‌ దర్శకత్వంలో వచ్చిన వేదం చిత్రం తనకు మంచి పేరు తెచ్చిందన్నారు.దర్శనార్థం వచ్చిన రవిప్రకాష్‌ దంపతులు కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో అష్టోత్తరం పూజ నిర్వహించారు.

గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు.నాలుగు వేదాలతో అర్చకులు ఆశీర్వచనం అందజేశారు.

ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామి ప్రసాదాన్ని అధికారులు అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube