ఒంటె పాల గురించి ముఖ్యమైన విషయాలు... గాడిద పాలకంటే ఖరీదు తక్కువ, మేలు ఎక్కువ  

Unknown Facts About Camel Milk Comparing With The Donkey Milk -

ఒకప్పుడు గాడిదలను చిన్న చూపు చూసేవాళ్ళం.కాని ఇప్పుడు గాడిదల పాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

Unknown Facts About Camel Milk Comparing With The Donkey Milk

గాడద పాలు 500 నుండి 900 రూపాయల వరకు పలుకుతున్న విషయం తెల్సిందే.టీ స్పూన్‌ గాడిద పాలు ప్రతి రోజు తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు తొలగి పోతాయనేది డాక్టర్లు కూడా చెబుతున్న విషయం.

అందుకే మెట్రో నగరాల్లో గాడిదలను రోడ్లపై తిప్పుతూ పాలు అమ్ముతున్నారు.గాడిద పాలు చాలా ఖరీదు అయినా కూడా వాటిని వాడుతున్నారు.అయితే గాడిద పాలవలే ఒంటె పాలు కూడా చాలా మంచివని వైధ్యులు నిర్థారించారు.

ఒంటె పాల గురించి ముఖ్యమైన విషయాలు… గాడిద పాలకంటే ఖరీదు తక్కువ, మేలు ఎక్కువ-General-Telugu-Telugu Tollywood Photo Image

ఒంటె పాలు శరీరంలోని పలు రోగాలను తరిమేస్తాయని, ఒంటె పాల వల్ల దీర్ఘ కాలిక రోగాలు ఎన్నో పోతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.మనదేశంలో ఒంటెలు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో ఇప్పటికే ఒంటె పాల ప్యాపారం జరుగుతోంది.అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇంకా ఒంటె పాల గురించిన అవగాహణ రాలేదు.

ఒంటె పాల వల్ల డయాబెటీస్‌, విటమిన్స్‌ లోపం, జాండీస్‌, టీబీ, రక్తహీనత, ఆటిజం మొదలగు సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు.

ఒంటె పాల వ్యాపారం ఇప్పుడిప్పుడే మొదలైంది.ఒక ఒంటే రోజులో రెండు సార్లు కలిసి నాలుగు నుండి అయిదు లీటర్ల పాలు ఇస్తుంది.అందుకే ఒంటెల పాల రేట్లు 300 నుండి 350, 400 వరకు ఉంటుందని రాజస్థాన్‌కు చెందిన కొందరు అంటున్నారు.

ఒంటెల పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండే పరిస్థితి లేదు.ఒకవేళ పాలు నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేస్తే వివిధ రాష్ట్రాలకు వాటిని సరఫరా చేస్తు ఎక్కువ మొత్తాలను పొందవచ్చు అనేది అక్కడ ఒంటెల పెంపకం దారుల అభిప్రాయం.మొత్తానికి గాడిద పాలు మాత్రమే కాకుండా ఒంటె పాలకు కూడా డిమాండ్‌ వచ్చింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Unknown Facts About Camel Milk Comparing With The Donkey Milk Related Telugu News,Photos/Pics,Images..

footer-test