బిగ్ బాస్ 2 లోకి ఎంటర్ అయిన నందిని గురించి ఈ షాకింగ్ నిజాలు తెలుసా.?  

బిగ్ బాస్ సీజన్ – 2లో ఎలిమినేట్ అయిన తొలి సభ్యురాలిగా సంజన నిలిచింది.ఆమె బయటకు వచ్చిన తర్వాత హౌజ్‌లో ఉన్న ఇద్దరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తేజస్విని ఉద్దేశిస్తూ అతి చేయొద్దని సలహా ఇచ్చింది.సెలబ్రిటీగా ఫీలవ్వొద్దని.బయట కావొచ్చేమో కానీ.హౌజ్‌లో కాదని విమర్శించింది.మరోవైపు బాబు గోగినేనిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది.గోగినేని కనిపించేంత మంచి వ్యక్తి కాదని… తను చాలా గేమ్ ప్లే చేస్తున్నాడని విమర్శించింది.

-

బిగ్ బాస్ 2 లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన “నందిని” ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది.ఆమె ఎవరా అని సెర్చ్ చేయడం మొదలుపెట్టారు నెటిజెన్ల.

నిజానికి ఈమె బిగ్ బాస్2 మొదలయ్యే రోజే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ఉండాలి కానీ ఈమెకు అనుకోకుండా ఆక్సిడెంట్ అవ్వడంతో ఈ వారం ఆమెను బిగ్ బాస్ హౌస్ లోకి పంపనున్నారు.

హైదరాబాద్ కు చెందిన ఈ అమ్మాయి…సేంట్ ఆల్బాన్స్ స్కూల్ నుండి 2003 లో పాస్ అయ్యారు.

ఉన్నత చదువులకోసం లండన్ వెళ్ళింది.అక్కడినుండి ఎంబీఏ ఫైనాన్స్ పూర్తీ చేసింది.ఆమె 80 కి పైగా ఇండియన్ అండ్ ఇంటెర్నేషన్ బ్రాండ్స్ కి మోడల్ గా వ్యవహరించింది.నందిని రాయ్ మోడలింగ్ చేస్తున్న తరుణం లో ఆమెకు 2008 మిస్ హైదరాబాద్ కిరీటం, 2009 లో ఫ్రెస్ పేస్ అఫ్ ఆంధ్రప్రదేశ్, 2010 లో మిస్ ఆంధ్రప్రదేశ్ వంటి బ్యూటీ కాంటెంట్స్ లలో విజేతగా
నిలిచింది.

నందిని రాయ్ 2011 లో ఫామిలీ ప్యాక్ అనే హిందీ సినిమాతో తన సినిమా కెరియర్ ని స్టార్ చేసింది.2013 లో మలయాళం లో “గుడ్ బాయ్ డిసెంబర్” అనే సినిమాలో నటించింది.2014 లో తెలుగు తెరకు “మాయ” అనే సినిమాతో మన ముందుకు వచ్చిన ఆ సినిమా అంతగా ఆడలేదు.ఆ తరువాత కన్నడలో ఖుషి ఖుషీగా అనే సినిమాలోనూ నటించింది.

మళ్ళీ 2015 తెలుగులో సుదీర్ బాబు సరసన మోసగాళ్లకు మోసగాడు అనే సినిమాలో నటించింది.

ప్రస్తుతానికి తమిళ్ లో గ్రహణం, తెలుగులో సుడిగాడు 2 అనే రెండు సినిమాలు చేస్తున్న సమయం లో బిగ్ బాస్ 2 లో అవకాశం వచ్చింది.మరి ఇప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని నందిని ఏ మేరకు ఉపయోగించుకుంటుందో వేచి చూడాల్సిందే.

ఆమె dubsmash వీడియోలు ఒకసారి లుక్ వేయండి

.

తాజా వార్తలు