భాను ప్రియా వైవాహిక జీవితం గురించి ఎవరికి తెలియని విషయాలు

భానుప్రియ.తెలుగు సినిమా పరిశ్రమలో అగ్రతారగా కొనసాగిన నటీమణి.

 Unknown Facts About Bhanu Priya Marriage Life-TeluguStop.com

చక్కటి అందంతో పాటు మంచి డ్యాన్సర్ గా గుర్తింపు పొందింది.అందుకే ఆమె కళ్లతో నవరసాలు పలికించేది.

చెప్పాల్సిన విషయాలన్ని ఆమె కళ్లతోనే అర్థం అయ్యేలా చేసేది.ఒక దశాబ్దం పాటు అగ్ర నటీమణిగా కొనసాగింది భానుప్రియ.

 Unknown Facts About Bhanu Priya Marriage Life-భాను ప్రియా వైవాహిక జీవితం గురించి ఎవరికి తెలియని విషయాలు-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమా జీవితం ఎలా ఉన్నా వ్యక్తిగత జీవితం మాత్రం అంత సాఫీగా కొనసాగలేదు.కెరీర్ తొలినాళ్లలో సితార సినిమాలో హీరోయిన్ గా తనను ఎంపిక చేసిన దర్శకుడు వంశీతో భానుప్రియ ప్రేమలో పడింది.

అప్పటికే వంశీకి పెళ్లి అయ్యింది.అయినా రెండో వివాహం చేసుకోవాలి అనుకుంది.

కానీ భానుప్రియ తల్లి ఒప్పుకోకపోవడంతో పెళ్లి జరగలేదు.

అనంతరం ఆద‌ర్శ్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

ఆయన అమెరికాలో ఫోటోగ్రాఫర్ గా పని చేసేవాడు.అయితే తన సినిమా జీవితాన్ని వదులుకుని అమెరికాకు వెళ్లిపోయింది.

ఆ తర్వాత తనకు ఓ అమ్మాయి పుట్టింది.పేరు అభినయ.

అయితే వీరి మధ్య కొంత కాలానికి మనస్పర్థలు వచ్చాయి.వాటిని నెమ్మదిగా తొలగించుకుంది.2005లో భానుప్రియ మళ్లీ చెన్నైకి వచ్చింది.తన కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం మూలంగా ఆదర్శ్ కుటుంబానికి ఎక్కువగా సమయం ఇచ్చేవాడు కాదట.

అందుకే భానుప్రియ ఇండియాకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి.

Telugu Bhanu Priya, Bhanu Priya Husband, Bhanu Priya Husband Adarsh, Bhanu Priya Married Life, Bhanupriya Career, Character Aritst, Photographer In America, Tollywood Heroine-Telugu Stop Exclusive Top Stories

ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చింది.క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి సినిమాలు చేసింది.అయితే 2005లో భర్తతో తన విడాకులు మంజూరు అయ్యాయని చెప్పింది.

ప్రముఖ పత్రికలు కూడా ఇదే వార్తలను ప్రచురించాయి.అయితే ఈ వార్తలను తోసిపుచ్చింది భానుప్రియ.

ప్రతి సంసారంలో మాదిరిగానే తమ కుటుంబంలోనూ కొన్ని సమస్యలు వచ్చాయని తెలిపింది.అయితే సుమారు 13 సంవత్సరాల పాటు భానుప్రియ ఇండియాలో, ఆదర్శ్ అమెరికాలో ఉన్నారు.2018లో ఆదర్శ్ గుండెపోటుతో చనిపోయాడు.వెంటనే భానుప్రియ అమెరికాకు వెళ్లింది.

ఆయన అంత్య క్రియల్లో పాల్గొంది.ఈ ఘటనతో ఆమె కుటుంబానికి సంబంధించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు అని నిరూపితం అయ్యింది.

#Bhanu Priya #Bhanu Priya #BhanuPriya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు