అలాంటి పాత్రల్లోనే నటిస్తున్న ‘బాండిట్ క్వీన్‌’.. ఇంతకీ ఆమె ఇప్పుడేం చేస్తుందంటే?

అగ్రవర్ణాలకు చెందిన ఠాకూర్ల చేతిలో లైంగిక, కురపర వేధింపులకు గురై.అనంతరం వారికి వ్యతిరేకంగా పోరాడి వారి గుండెల్లో దడపుట్టించింది పూలన్ దేవి.

 Unknown Facts About Bandit Queen Actress Seema Bishwas Details, Bandit Queen, Se-TeluguStop.com

అలాంటి పూలన్ దేవి జీవితం ఆధారంగా 1994 రూపొందించిన ‘బాండిట్ క్వీన్’ అనే చిత్రం అప్పట్లో ఓ సంచలనం.ఈ సినిమాను డైరెక్ట్ చేసిన శేఖర్ కపూర్‌కు ఇంటర్‌నేషనల్ లెవల్‌లో మంచి పేరు తీసుకొచ్చింది ఈ మూవీ.

అప్పటి వరకు జనాలకు పెద్దగా తెలియని సీమా బిశ్వాస్. ‘బాండిట్ క్వీన్’ సినిమాలో పూలన్ దేవి పాత్రలో అద్భుతంగా నటించి జాతీయస్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది.

అనేక ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడిన ఈ చిత్రం.తక్కువ కాలంలోనే కల్ట్‌ఫిల్మ్‌గా పేరు సంపాదించుకుంది.

ఈ సినిమాతో సీమా బిశ్వాస్ కు పేరు రావడంతో చాలా మంది ఇదే ఆమెకు ఫస్ట్ మూవీ అని పొరబడ్డారు.కానీ అంతకంటే ముందు ఆమె అంషిణి అనే హిందీ మూవీలో నటించింది.

బాండిట్ క్వీన్ మూవీ మాత్రం ఆమెను ఓవరన్ నైట్ స్టార్‌ను చేసింది.

అనంతరం డైరెక్టర్ సంజయ్‌ లీలా భ‌న్సాలి దర్శకత్వం వహించిన ‘ఖామోషి.

ద మ్యూజిక‌ల్’లో యాక్ట్ చేసి బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట్రెస్‌గా అవార్డు అందుకుంది.‘వాట‌ర్‌’ సినిమాలో నటించి బెస్ట్ యాక్ట్రెస్‌గా అవార్డు దక్కించుకుంది.

రామ్‌గోపాల్‌వ‌ర్మ డైరెక్ట్ చేసిన ‘కంపెనీ’ మూవీలో రాణీబాయ్‌ పాత్రలో నటించింది.

Telugu Seema Bishwas, Actressseema, Bandit Queen, Company, Sekhar Kapoor, Poolan

అనంతరం పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు మరింత చేరువైంది.గతేడాది జీ5లో స్ట్రీమింగ్ అయిన ‘కోడ్ ఎం’ అనే వెబ్‌సిరీస్‌లో ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్‌లో నటించిన సీమాబిశ్వాస్. తాజాగా ‘ద ఫ్యామిలీ మ్యాన్’2 లో ప్రధానమంత్రి పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నది.

మ‌న‌సుకు న‌చ్చిన పాత్రల్లో మాత్రమే నటిస్తూ.నటిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నది సీమా బిశ్వాస్.

ఇలాగే తన ఇమెజ్ తగ్గ పాత్రలు చేస్తూ పోతే.మరి కొన్ని అవార్డులు ఆమె ఖాతాలో చేరడం ఖామయంటున్నారు సినీ విశ్లేషకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube