నిజమా భయ్యా : ఐఫోన్ ని ఎక్కువగా అందుకే కొంటున్నారట...

ప్రస్తుతం మొబైల్ టెలికాం రంగంలో ఆపిల్ ఐఫోన్ ఉత్పత్తులకి ఉన్నటువంటి గిరాకీ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు.అయితే ఒకప్పుడు ఆపిల్ కంపెనీ ఉత్పత్తులకి నోకియా సెల్ ఫోన్లు బాగానే పోటీ ఇచ్చాయి.

 Unknown Facts About Apple Iphone Purchasing-TeluguStop.com

కానీ పలు అనివార్య కారణాల వల్ల నోకియా సెల్ ఫోన్లను భారతదేశంలో కొంతకాలం పాటు నిషేధించారు.ఆ తరువాత ఈ నోకియా సెల్ ఫోన్లు సంస్థను మైక్రోసాఫ్ట్ సంస్థ కొనుగోలు చేసి మైక్రోసాఫ్ట్ మొబైల్ ఫోన్స్ పేరుతో విడుదల చేసినప్పటికీ పెద్దగా క్లిక్ కాలేదు.

దీంతోపాటు భారతదేశంలో నోకియా సెల్ ఫోన్ల మార్కెట్ కూడా చాలా తగ్గిపోయింది.దీంతో ప్రస్తుతం ఆండ్రాయిడ్ వర్షన్ లో శాంసంగ్, రెడ్మీ, రియల్ మీ ఒప్పో, వివో వంటి కంపెనీలు బాగానే రాణిస్తున్నాయి.

 Unknown Facts About Apple Iphone Purchasing-నిజమా భయ్యా : ఐఫోన్ ని ఎక్కువగా అందుకే కొంటున్నారట…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇటీవలే మళ్లీ నోకియా సంస్థ ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టుగా ఫీచర్లను అందిస్తూ సెల్ ఫోన్లని మార్కెట్లోకి తెచ్చినప్పటికీ ప్రజెంట్ మార్కెట్లో ఉన్నటువంటి కంపెనీల పోటీని తట్టుకోలేక పోతోంది.

అయితే తాజాగా ఓ సర్వే సంస్థ ఎక్కువ మంది ఆపిల్ ఐఫోన్లను కొనడానికి ఎందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారనే విషయంపై సర్వే చేసింది.

అయితే ఇందులో ఎక్కువ మంది ఐఫోన్ వినియోగదారులు కేవలం సెల్ఫీలు తీసుకోవడానికి మాత్రమే ఆపిల్ ఐఫోన్ ని వాడుతున్నారట.మరికొంతమంది తమ స్టేటస్ సింబల్ గాను అంతేగాక స్టేటస్ కి తగ్గట్టుగానే ఖరీదు ఉండడంతో ఈ మొబైల్ బ్రాండ్ ఎంచుకుంటున్నారట.

అయితే భారతదేశంలో ఆపిల్ ఐఫోన్ మొబైల్ ధర దాదాపుగా 30 వేల రూపాయల నుంచి మొదలు కాగా మోడల్ ని బట్టి దాదాపుగా లక్ష రూపాయలకు పైగా ఉంది.

అయితే ఇంత ఖర్చు పెట్టి కొన్నఇప్పటికీ ఐఫోన్ లోని ఫీచర్లు గురించి చాలామందికి పూర్తిగా తెలియదని, కేవలం ఫోన్ కాల్స్ మాట్లాడడానికి మరియు ఫోటోలు తీసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారట.

అయితే ఐఫోన్ యొక్క ప్రత్యేకతల్లో ఈ ఫోన్లలో నిల్వ చేయబడిన సెక్యూరిటీ విధానం ఒకటి.ఒకవేళ మీరు పొరపాటున మీ ఐఫోన్ ని పోగొట్టుకున్నా మీ ఫోన్ లో ఉన్నటువంటి డేటా మరియు ఇతర సమాచారం చాలా భద్రంగా ఉంటుంది.

అందువల్లనే ఐ ఫోన్ చాలా కాస్ట్లీ గురూ అంటున్నారు మరికొందరు.

అయితే ఆపిల్ తరహాలోనే శాంసంగ్, మోటోరోలా, సోనీ, తదితర సంస్థలు కూడా లక్ష రూపాయల బడ్జెట్లో సెల్ ఫోన్లని అందిస్తున్నప్పటికీ ఎక్కువ మంది వినియోగదారులు మాత్రం ఆపిల్ బ్రాండ్ ను ఎక్కువగా ఎంచుకుంటున్నారు.

అయితే ప్రస్తుతం భారత దేశంలో శాంసంగ్, వన్ ప్లస్, ఆపిల్, తదితర సంస్థల ఉత్పత్తులు మొదటి రెండు మూడు స్థానాలలో ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారు.ఆ తర్వాత తక్కువ బడ్జెట్లో రెడ్ మీ, రియల్ మీ, మోటరోలా, ఒప్పో, వివో, తదితర సంస్థల సెల్ ఫోన్లని వినియోగిస్తున్నారు.

#AppleCompany #UnknownFacts #UnknownFacts

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు