యాంకర్ వర్షిణి గురించి చాలామందికి తెలియని షాకింగ్ నిజాలు ఇవే.!       2018-06-23   02:52:11  IST  Raghu V

అందాల ఆరబోతను బుల్లితెరకు పరిచయం చేసిన యాంకర్స్ అనసూయ,రష్మి.ఒకప్పుడు తెలుగు ఛానెల్స్ లో యాంకర్స్ అంటే మోడ్రన్ డ్రెసెస్ ధరించినప్పటికి ఎక్కడా ఎక్స్పోజింగ్ ఉండేది కాదు..కాని జబర్దస్త్ ప్రోగ్రాంలో అనసూయ,రష్మి యాంకరింగ్ కి గ్లామర్ సొగసులు అద్దారు.ఇప్పుడు వారబాటలోనే పయనిస్తుంది వర్షిణి .ఇటీవల కాలంలో ఇన్స్ట్రాగ్రాంలో ఈవిడ పోస్ట్ చేసిన ఫోటోలు యమా హాట్ హాట్ గా ఉన్నాయి..ఈమె గురించి రెండు విషయాలు వెలుగులోకి వచ్చాయి…

-

తెలుగులో సూపర్ హిట్ డాన్స్ ఫ్రోగ్రామ్ ఢీ-10కు వర్షిణి సౌందరాజన్ కో-యాంకర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా మంది ఈ అమ్మడు తెలుగు బుల్లి తెరకు కొత్త అనుకుంటున్నారు. కానీ ఈ హాట్ లేడీ బ్యాగ్రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్‌. యాంకర్ వర్షిణిగా ఇపుడు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన ఈమె……. అంతకు ముందు వెండి తెరపై పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది. ‘చందమామ కథలు’, ‘బెస్ట్ యాక్టర్స్’తో పాటు పలు చిత్రాల్లో నటించింది.ఆ సినిమాలప్పుడు ఈ పేరు వినలేదే అనుకుంటున్నారా..అప్పుడు అమ్మడి పేరు శామిలి సౌందరాజన్.

‘బెస్ట్ యాక్టర్స్’ సినిమా దర్శకుడు అరుణ్ పవార్‌తో శామిలి ప్రేమలో పడింది. 2015లో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు మీడియా ముఖంగా ప్రకటించారు. అయితే ఈ జంట ప్రేమ వ్యవహారం పెళ్లి పీటల వరకు వెళ్లకముందే విడిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియా స్టేటస్ సింగిల్ అని ఉండటాన్ని బట్టి ఆవిడ ఇంకా ఎవరితో మింగిల్ అవ్వలేదని భావిస్తున్నారు.

-

శామిలి సౌందరాజన్‌గా సినీ రంగానికి పరిచయం అయిన ఈ బ్యూటీ…..అక్కడ సరైన అవకాశాలు లేక పోవడంతో బుల్లితెర వైపు టర్న్ అయ్యారు. వర్షిణిగా పేరు మార్చుకుంది.ఇండస్ట్రీలో లక్ కోసం అవకాశాల కోసం పేర్లు మార్చుకోవడం సహజమే కాని…వర్షిణి పేరు మార్చుకున్నాక అటు షార్ట్ ఫిలింస్ లోనూ,ఇటు యాంకర్ గా సూపర్ గా క్లిక్ అయింది.ప్రస్తుతానికి యాంకర్ గా సెటిల్ అయిపోయింది.అయితే ఇప్పటివరకు హోమ్లీగా కనపడిన ఈ అమ్మడు ఇటీవల మలేషియా టూర్ వెళ్లినప్పుడు దిగిన ఫోటోలను ఇన్స్ట్రాగ్రాంలో పోస్టు చేసింది..హాట్ హాట్ ఫోటోలకు సోషల్ మీడియాలో రెస్పాన్స్ బాగానే వస్తుంది..అందాల ఆరబోత తనకెన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందో చూడాలి…

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.