ఆఖరిపోరాటం కోసం సుహాసినికి దర్శకేంద్రుడు ఏం చెప్పాడో తెలుసా?

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన సినిమా ఆఖ‌రి పోరాటం.ఇందులో నాగార్జున, సుహాసిని హీరో, హీరోయిన్లుగా చేశారు.అంతేకాదు.ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా అతిలోక సుందరి శ్రీదేవి యాక్ట్ చేసింది.అయితే నాగార్జున హీరోగా చేసిన ఈ సినిమాలో హీరోయిన్ గా చేయాలని సుహాసినిని అడిగింది దర్శకుడో, నిర్మాతో కాకపోవడం విశేషం.ఈ సినిమాలో నటించాలని అడిగింది మెగాస్టార్ చిరంజీవి.

 Unknown Facts About Akhari Poratam Movie And Suhasini-TeluguStop.com

అదేంటి నాగార్జున సినిమాలో నటించాలని.చిరంజీవి అడగడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అసలు విషయం తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

రాఘ‌వేంద్ర‌ రావు ఆఖరి పోరాటం సినిమాలో హీరోయిన్ గా నీపేరే చెప్పాడని చిరంజీవి సుహాసినితో అన్నాడు.అందుకే ఈ సినిమాలో నువ్వు నటిస్తే బాగుంటుంది.అందుకే కథ విను అని సుహాసినితో అన్నాడు చిరంజీవి.ఆఖ‌రి పోరాటంలో సునాద‌మాల‌గా సుహాసిని యాక్ట్ చేసింది.

 Unknown Facts About Akhari Poratam Movie And Suhasini-ఆఖరిపోరాటం కోసం సుహాసినికి దర్శకేంద్రుడు ఏం చెప్పాడో తెలుసా-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ పాత్ర చాలా బాగుంటుంది.తొలుత ఈ క్యారెక్టర్ కు రేవతి అనుకున్నాడట రాఘవేంద్రరావు.

అయితే సుహాసిని కలిసినప్పుడు.నువ్వు ఈ క్యారెక్టర్ చేయను అంటే రేవతిని అడుగుతాను అన్నాడట.

అంతేకాదు.నీకు నచ్చకపోతే నీ ఫ్రెండ్ అయిన రేవతికి నువ్వే చెప్పి ఒప్పించాలని మరో మాట చెప్పాడట.

చేస్తే నువ్వు.లేదంటే తను.ఈ ఇద్దరిలో ఎవరో నువ్వే డిసైడ్ చేయాలి అన్నాడట దర్శకుడు రాఘవేంద్రరావు.ఈ విషయాన్ని సుహాసిని స్వయంగా చెప్పింది.

Telugu Aakhari Poratam Movie, Chiru Suggested Suhasini, Director Raghavendra Rao, Megastar Chiranjeevi, Nagarjuna, Nagarjuna Suhasini Chemistry, Revathi, Sridevi, Suhasini-Telugu Stop Exclusive Top Stories

అంతేకాదు.ఆఖ‌రి పోరాటం తొలి రోజు షూటింగ్ లో పలు ఆసక్తికర ఘటనలు జరిగినట్లు సుహాసిని వెల్లడించింది.తొలుత తాను కిందపడిపోతుంది.ఆమె మీద నాగార్జున పడిపోతాడు.ఈ ఇద్దరి మీద ఓ ఫిల్లర్ పడుతుంది.చాలా సేపు వీరిద్దరు ఫిల్లర్ కింద ఉన్నట్లు నటించాలి.

అలాగే చేశారు కూడా.ఈ సీన్ లో రొమాన్స్ బాగా పండింది కూడా.

సుహాసిని, నాగార్జున మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకు అదనపు అసెట్ గా మిగిలింది.ఈ సినిమా కూడా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.

#Chiranjeevi #Sridevi #Raghavendra Rao #Chiru Suhasini #Aakhari Poratam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు