రాజ్యలక్ష్మి. ఈ పేరు వింటే ఎక్కడో విన్నట్లుందే అని అనుకుంటాం.సరిగా గుర్తు పట్టలేం.కానీ.శంకరాభరణం రాజ్యలక్ష్మి అనగానే టక్కున గుర్తొస్తారు.చక్కటి ముఖంతో అందమైన నటనతో సంప్రదాయ బద్దంగా కనిపిస్తుంది ఈ నటీమణి.
అమాయకంగా కనిపించే ముఖం, విశాలమైన కళ్లతో చూడగానే ఆకర్షించే రూపం ఆమె సొంతం.కళాతపస్వి కె.విశ్వనాథ్ లాంటి లెజండరీ డైరెక్టర్ రూపొందించిన క్లాసిక్ మూవీ శంకరాభరణం ద్వారా.ఆమె తెలుగు తెరకు పరిచయం అయ్యింది.
ఆ తర్వాత సినిమా పేరే తన ఇంటి పేరుగా మార్చుకుంది.
ఇంతకీ ఒక లెజెండరీ దర్శకుడి సినిమాలో ఈ కొత్త నటికి అవకాశం ఎలా వచ్చింది? అనే ప్రశ్న అప్పట్లో హల్ చల్ చేసింది.తనకు ఎలా అవకాశం వచ్చింది అనే విషయాన్ని స్వయంగా రాజ్యలక్ష్మి వెల్లడించింది.అమ్మ నన్ను నటిగా చేయాలనుకుంది.ఆమెకు నాటకాలలో మంచి అనుభవం ఉంది.మూడు నెలల పాటు రాజ్యలక్ష్మి కూడా నాటకాలు వేసింది.
ఆ తర్వాత తన తల్లి ఆమెను మద్రాసు తీసుకెళ్లింది.మొదట్లో సినిమా పిచ్చోళ్లు సినిమాలో తనను రెండో హీరోయిన్‌గా చేయాలని అడిగినా తన తల్లి ఒప్పుకోలేదని చెప్పింది.
కొద్ది రోజుల తర్వాత తనను తీసుకుని కె.విశ్వనాథ్ దగ్గరికి వెళ్లారు.
ఓ సీన్ చెప్పి నటించమన్నారు.అంతకు ముందు నటించిన నాటకంలో ఒక సీన్‌ను యాక్ట్ చేసి చూపించింది.కానీ అపుడే ఓకే చెప్పలేదు.ఆ రాత్రి కూడా తనకు నిద్రపట్టలేదు.విశ్వనాథ్ లాంటి గొప్ప దర్శకుడు తనకు ఓకే చెప్తారా? అనే అనుమానం కలిగిందని చెప్పింది.ఆ మర్నాడు విశ్వనాథ్ ఆమెను శంకరాభరణం సినిమా హీరోయిన్ గా ఓకే చేసినట్లు విషయం తెలిసిందన్నారు.
ఆ న్యూస్ వినగానే వెంటనే తనకు ఎంతో సంతోషం కలిగిందన్నారు.ఆయన సినిమా ద్వారా సినిమా పరిశ్రమకు తాను పరిచయం కావడం పూర్వజన్మ సుక్రుతంగా భావిస్తున్నట్లు రాజ్యలక్ష్మి చెప్పింది.