ఒకప్పటి హీరోయిన్ 'సాక్షి శివానంద' గుర్తుందా.? ఇప్పుడు ఏం చేస్తుందో.. ఎవరిని పెళ్ళి చేసుకుందో తెలుసా?  

Unknown Facts About Actress Sakshi Shivanand -

సాక్షి శివానంద్ తెలుగులో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరోయిన్.1996లో ఆమె బాలీవుడ్ లోకి మొట్టమొదటి సారిగా అడుగు పెట్టింది.తరువాత తెలుగులో సినిమా అవకాశాలు రావడంతో అక్కడ మంచి పేరు సంపాదించుకుంది.ఆమె తెలుగులో నటించిన మొదటి సినిమా చిరంజీవి కథానాయకుడిగా నటించిన మాస్టర్.అది మంచి ప్రజాదరణ పొందడంతో ఆమెకు తెలుగులో ప్రముఖ కథానాయకుల సరసన నటించేందుకు మరిన్ని అవకాశాలు వచ్చాయి.అక్కినేని నాగార్జునతో సీతారామరాజు, మహేష్ బాబుతో యువరాజు, బాలకృష్ణతో వంశోద్ధారకుడు, రాజశేఖర్ తో సింహరాశి, మోహన్ బాబుతో యమజాతకుడు సినిమాలలో కథానాయికగా నటించింది.

Unknown Facts About Actress Sakshi Shivanand

మంచి హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న టైం లో సడన్ గా ఈ అమ్మడు సినిమాలనుండి మాయం అయ్యింది.ఐదేళ్ల క్రితం వచ్చిన ‘హోమం’ సినిమాలో ఐటెం సాంగ్ ద్వారా మళ్లీ ఇక్కడ ప్రత్యక్షమైంది.

‘రంగ ది దొంగ’ సినిమాలో ‘మిల మిల మిల మీనాక్షి.’ అంటూ సాగే పాటలో మళ్లీ తళుక్కున మెరిసింది.

ఒకప్పటి హీరోయిన్ ‘సాక్షి శివానంద’ గుర్తుందా. ఇప్పుడు ఏం చేస్తుందో.. ఎవరిని పెళ్ళి చేసుకుందో తెలుసా-Movie-Telugu Tollywood Photo Image

ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు.గత యేడాది ఆమె ఒక హిందీ సినిమాలో నటించింది.

తెలుగులో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానని పాత్ర బాగుంటే సినిమా చేస్తానని చెబుతోంది సాక్షి.సాక్షి శివానంద్ పెళ్ళి చేసుకున్న విషయం కూడా చాలా మందికి తెలీదు.ఎందుకంటే ఆమె పెళ్ళి ఫోటోలు కూడా బయటకు రాలేదు.సాగర్ అనే ఒక బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకుంది సాక్షి.ప్రస్తుతం సాక్షి తన భర్త కు ఉన్న వ్యాపారాలు చూసుకుంటూ.సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తుంది

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు