తెలుగు సినీ చరిత్రలో ఆమెది చెరగని ముద్ర.ఇండస్ట్రీ తొలినాళ్లలో నవరసాలతో తెలుగు తెరమీద సందడి చేసి మహా నటశిఖామణ ఆమె.
ఆమెనే పసుపులేటి కన్నాంబ. అలనాటి తెలుగు చిత్ర పరివ్రమో కన్నాంబ ఒక వెలుగు వెలిగింది.
వీరత్వంలోనూ కరుణత్వంలోనూ ఆమెది పైచేయి.సన్నివేశం ఏదైనా ఆమె ఉందంటే ఆ సన్నివేశానికి ప్రాణం పోయడమే ఆమెకు తెలిసిన విద్య.
తన కంచుకంఠంతో చెప్పే డైలాగుతు చాలా ఫేమస్.ఆమె గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోయినా అప్పటి తరం ఆమెకోసం థియేటర్లకుయ క్యూ కట్టేవారు.
కన్నాంబ పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు ప్రాంతంలో పుట్టి వెండి తెర వరకు ప్రయాణం సాగించారు.ఆమెకి చిన్నప్పటి నుంచే కొత్త విషయాలు తెలుసుకోవాలని, అలాగే ఏదైనా పనిని ధైర్యంగా చయాలనే పట్టుదల చాలా ఎక్కువ.
అందుకే ఆమె నట ప్రస్థానం అంతలా సాగింది.చిన్నప్పటి నుంచే ఆమె నాటకాలపై ఇష్టం పెంచుకుని ఓ స్థాయి వచ్చాక ఆమె 1935లో టి.ఎ.రామన్ డైరెక్షన్లో వచ్చిన హరిశ్చంద్ర మూవీతో ఎంట్రీ ఇచ్చారు.ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.జానపదాల నుంచి చారిత్రక నేపథ్యం దాకా పాత్ర ఏది ఇచ్చినా ఇట్టే చేసేసేది.
కనకతార నుంచి మొదలు పెడితే గృహలక్ష్మితో పాటు పల్నాటి యుద్ధం లాగే పాదుకా పట్టాభిషేకం లాంటి ఎన్నో మైలురాళ్లుగా నిలిచిన సినిమాల్లో ఆమె నటించారు.ఆ తర్వాత ఆమె దర్శక నిర్మాత కడారు నాగభూషణంను పెండ్లి చేసుకుని సెటిల్ అయ్యారు.ఆ తర్వాత శ్రీరాజరాజేశ్వరీ పిక్చర్స్ బ్యానర్ ను ఏర్పాటు చేసి 22 మూవీలను తీశారు.ఇలా ఎంతో మందికి ఉపాధి కల్పించారు ఆమె.కానీ కొన్ని కుటుంబ కలహాలు ఆమెను మానసికంగా కృంగదీయడంతో అనారోగ్యం బారిన పడి చివరకు ప్రాణాలు విడిచారంట.ఇక ఆమె భర్త కూడా ఉదాసీనత కనబర్చడంతో అన్ని ఆస్తులను పోగొట్టుకుని చివరకు ఇరుకైన అద్దె ఇంట్లోకి మారాల్సి వచ్చింది.
కోట్లకొలది సంపద నుంచి చివరకు దీన స్థితికి చేరుకున్నారు.ఇలా ఎంతో వైభవంగా సాగిన వారి ప్రయాణం చివరకు విషాదంతో ముగిసిపోయింది.