హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న అలనాటి నటీమణి

Unknown Facts About Actress Jayachithra

జయచిత్ర.ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో గ్లామరస్ హీరోయిన్.తన అందం, అభినయంతో ఎన్నో సినిమాల్లో నటించింది.అద్భుత హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఆమె సుమారు 200 సినిమాల్లో నటించింది.అప్పట్లో ఈమె నటనే కాదు.

 Unknown Facts About Actress Jayachithra-TeluguStop.com

అద్భుతమైన వాయిస్ తో చెప్పే డైలాగులు జనాలను విపరీతంగా ఆకట్టుకునేవి.తాజాగా ఆమె తన కెరీర్ కు సంబంధించిన పలు విషయాలను వెల్లడించింది.

అగ్రహీరోలఎన్టీఆర్, ఏఎన్నార్ ను చాలా దగ్గరగా చూసినట్లు చెప్పింది.ఎన్టీఆర్ కు సినిమాలతో పాటు రాజకీయాల మీద మక్కువ ఉండేదని చెప్పింది.ఏఎన్నార్ కు మాత్రం రాజకీయాలు అంతగా ఇష్టం ఉండేది కాదని వెల్లడించింది.అయితే సినిమాల విషయంలో మాత్రం ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండేవన్నది.

 Unknown Facts About Actress Jayachithra-హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న అలనాటి నటీమణి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏఎన్నార్ సెట్ లో చాలా సింపుల్ గా ఉండేవాడని చెప్పింది.ఆయన మాటల్లో చాలా కామెడీ ఉండేదని చెప్పింది.

తాను పెద్ద హీరోను అనే గర్వం ఉండేది కాదని చెప్పింది.అయితే తాను మాత్రం తన పాత్రమీదే ఎక్కువ ఫోకస్ పెట్టేదాన్నని చెప్పింది.

ఆయా సినిమాల్లో తన క్యారెక్టర్ ఏంటి? డైలాగులు ఎలా చెప్పాలి? అనే విషయాల గురించే ఎక్కువ ఆలోచించేదని వెల్లడించింది.అప్పట్లో కొంత మంది హీరోలు తన డేట్ల కోసం వేచి చూసేవారని చెప్పింది.

తెల్లవారు జామున 2 గంటలకు నిద్రపోయి 4 గంటలకు లేచి షూటింగులకు వెళ్లిన సందర్భాలున్నాయని చెప్పింది.

తాను ఒక ఏడాదిలో 23 సినిమాలు చేసినట్లు చెప్పింది.రోజుకి 5 షిఫ్టుల్లో కూడా పని చేసినట్లు చెప్పింది.వచ్చిన అవకాశాలను కాదనకుండా చేసినట్లు వెల్లడించింది.

అప్పట్లో లక్ష నుంచి మూడు లక్షల రూపాయల పారితోషకం తీసుకున్నట్లు చెప్పింది.అయితే తాను డబ్బు కోసం ఎప్పుడు పని చేయలేదని చెప్పింది.

తాను డబ్బు వెంట పడలేదని చెప్పింది.డబ్బే తనను వెతుక్కుంటూ వచ్చినట్లు చెప్పింది.

కొన్ని సినిమాల్లో హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు జయచిత్ర వెల్లడించింది.

Video : Unknown Facts About Actress Jayachithra Details, Actress Jaya Chitra, Heorine Jayachitra, Tollywood Veteran Heroine, Sr Ntr, Akkineni Nageswara Rao, Jaya Chitra Remuneration, About Jaya Chitra

#Jaya Chitra #Sr #Jaya Chitra #Jaya Chitra #ActressJaya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube