బిగ్ బాస్ కంటెస్టెంట్ సామ్రాట్ గురించి ఈ నిజం తెలుస్తే షాక్ అవుతారు.! గే..అని భార్యతో వివాదం?       2018-06-14   01:39:44  IST  Raghu V

ఎంతో ప్రతిభ ఉన్నా కొన్ని వ్యసనాలు, వివాదాల కారణంగా కెరీర్ లో వెనక పడిన వారిలో సామ్రాట్ రెడ్డి ఒకరు. సామ్రాట్ పంచాక్షరీ, తకిట తకిట, బావ, దూసుకెళ్తా, దేనికైనా రెడీ, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సాధించాడు. కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలో భార్యతో విభేదాలు తన వ్యక్తిగత జీవితాన్ని విపరీతమైన ప్రభావాన్ని చూపింది. అదనపు కట్నం కోసం వేధించాడని, సైకో లా ప్రవర్తించాడని.. ఇంకా చాలానే ఆరోపణలు చేసింది సామ్రాట్ భార్య. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఇదంతా పాత సంగతి. నిన్న నాని హోస్ట్ గా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 2 లో సామ్రాట్ కూడా ఉన్నాడు.

-

సామ్రాట్ అసలు పేరు G.V.S.కృష్ణారెడ్డి. క్రికెటర్ అవుదామని అనుకున్న సామ్రాట్ ఎవరూ ఊహించని విధంగా సినిమా పరిశ్రమలోకి వచ్చాడు. ఇప్పటికి సినిమా షూటింగ్స్ లేనప్పుడు క్రికెట్ ఆడుతూ గ్రౌండ్ లోనే కన్పిస్తాడు సామ్రాట్. సామ్రాట్ కుటుంబం చాలా కాలం క్రితమే హైదరాబాద్ లో సెటిల్ అయింది. సామ్రాట్ సోదరి ఫ్యాషన్ డిజైనర్. సామ్రాట్ కి హరిత రెడ్డితో వివాహం అయ్యాక కొంతకాలం బాగానే ఉన్నారు. ఆ తర్వాత చిక్కులో పడ్డాడు. తన భర్త కట్నం కోసం వేధిస్తున్నాడని మొదట కేసు పెట్టింది సామ్రాట్ భార్య హరిత.

ఆ తర్వాత తన ఇంటిలో విలువైన వస్తువులు ఎత్తుకెళ్లాడని మరొక కేసు పెట్టింది. దాంతో సామ్రాట్ పరువు ప్రతిష్టలు మొత్తం పోయాయి. అంతేకాక సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. సామ్రాట్ కి భార్య దూరం కావటంతో సోదరితో కలిసి ఉంటున్నాడట. ఇంతకాలానికి బిగ్ బాస్ పుణ్యమా అని సామ్రాట్ పేరు తెర మీదకు వచ్చింది. ఒకవేళ బిగ్ బాస్ లో సామ్రాట్ కి మంచి గుర్తింపు వస్తే సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ కి దారి ఏర్పడినట్టే. చూద్దాం సామ్రాట్ బిగ్ బాస్ హౌస్ లో ఏం చేస్తాడో?

తన ఇంట్లోనే దొంగతనం చేసాడనే ఆరోపణతో భార్య ఇచ్చిన ఫిర్యాదుకు నటుడు సామ్రాట్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అరెస్ట్ తర్వాత అతడిని మియాపూర్‌ కోర్టులో పోలీసులు హాజరు పర్చగా…14 రోజులు జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉంచాలని చెర్లపల్లి జైలుకు తరలించారు.. సామ్రాట్ రెడ్డికి కండిషనల్‌ బెయిల్‌ మీద జైలు నుండి విడుదలయ్యారు.. ఇద్దరు వ్యక్తులు రూ.25 వేల పూచికత్తుపై బెయిల్‌ మంజూరు చేశారు. ప్రతి శనివారం సామ్రాట్‌రెడ్డి మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో హజరు కావాలని ఆదేశించారు… జైలు నుండి విడుదలైన సామ్రాట్ రెడ్డి తన భార్య గురించి మీడియాతో మాట్లాడారు.

సామ్రాట్‌ మీడియాతో మాట్లాడిన మాటలు…. ‘నా భార్యకు, నాకు మధ్య గొడవలకి కారణం మా అత్తమామలే.. నా పై వేధింపులు, దొంగతనం కేసు పెట్టారు. నా ఫ్రెండ్స్‌తో స్వలింగ సంపర్కం చేస్తున్నట్లు నాపై లేని నిందలు వేశారు. హర్షితా రెడ్డికి.. సినిమా వాళ్ళు అంటే ఇష్టం లేనప్పుడు పార్టీలకు ఎందుకు వచ్చింది..? నాగార్జున, సమంతలతో ఫొటోలు ఎలా దిగింది..? ఇంట్లో ఉన్న నా వస్తువులు తెచ్చుకుంటే నేను దొంగతనం చేశానని కేసు పెట్టి జైలుకి పంపారు. నేను డ్రగ్స్ తీసుకుంటాననేది ఆరోపణ మాత్రమే.. అందులో ఎంత మాత్రం నిజంలేదు. పార్టీలకు వెళ్లినప్పుడు హుక్కా మాత్రమే తీసుకుంటాను. వేరే అమ్మాయిలతో నాకు ఎఫైర్స్‌ ఉన్నాయంటున్నారు.. మరో పక్క’గే’ అంటున్నారు.. నేను ఆరోపణలు చేయాలనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. నన్ను జైలుకి పంపించిన తరువాత.. హర్షిత రెడ్డితో కాపురం చేయలేను’ అని ఖరాఖండిగా తెలిపారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.