రావణ బ్రహ్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

రావణాసురుడు అంటే అందరికి రాక్షసుడు, సీతాదేవిని అపహరించాడని మాత్రమే తెలుసు.రావణాసురుడు అందరిని హింసిస్తాడని మనకు తెలుసు.

 Unknown Fact About Ravan-TeluguStop.com

అయితే మనకు తెలియని ఎన్నో లక్షణాలు రావణాసురుడులో ఉన్నాయి.వాటి గురించి తెలుసుకుంటే చాల ఆశ్చర్యం కలుగుతుంది.

ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

రావణాసురుడుకి పది తలలు ఉంటాయి.

శివ భక్తుడు.స‌క‌ల శాస్త్రాలు, వేదాలు, పురాణాలు, విద్యలను అభ్యసించిన తెలివైనవాడు రావణుడు.

జైన రామాయణం ప్రకారం చూస్తే సీత రావణాసురుడికి కూతురు అవుతుందట.

రావ‌ణాసురుడు తన సొంత మేథాశ‌క్తితో పుష్పక విమానాన్ని త‌యారు చేశాడ‌ట‌.శాస్త్ర, విజ్ఞాన రంగాల్లో అత‌ను ఆరితేరి ఉండ‌డం వ‌ల్లే పుష్పక విమానాన్ని రావణాసురుడు త‌యారు చేశాడ‌ని చెబుతారు.

రావణాసురుడికి అలంకరణ పట్ల చాలా అభిరుచులు ఉన్నాయట.

స్త్రీల కన్నా బాగా అలంకరణ చేసుకొనేవారట.

రావణాసురుడు కులాలకు వ్యతిరేకి.

రాజ్యంలో అందరూ సమానం అని చెప్పేవాడట.కుటుంబం అంటే చాలా ప్రేమ ఉండేదట.

ఖ‌గోళ‌, జ్యోతిష్య శాస్త్రాల్లో రావ‌ణాసురుడు దిట్ట అట‌.ఆయా శాస్త్రాల‌ను అవపోసిన ప‌ట్టిన కొద్ది మందిలో రావ‌ణుడు కూడా ఒక‌ర‌ని చెబుతారు.

మ‌న దేశంతోపాటు శ్రీ‌లంక‌లోనూ కొన్ని ప్రాంతాల్లో ఇప్ప‌టికీ రావ‌ణున్ని పూజిస్తారు.దైవంగా ఆరాధిస్తారు.

రావణాసురుడి వద్ద సీతాదేవి కొన్ని నెలల పాటు ఉండటంతో, రాముడు యుద్ధంలో రావణుణ్ణి చంపాక ఆమెకు అగ్ని ప‌రీక్ష పెట్టి ఆ తరవాతే రాముడు సీతాదేవిని స్వీక‌రిస్తాడు.అయితే రావ‌ణుడి భార్య మండోద‌రిని వానర సేన‌లు వేధిస్తాయ‌ట‌.

అయిన‌ప్ప‌టికీ రావ‌ణుడు త‌న భార్య‌కు ఎలాంటి ప‌రీక్ష పెట్ట‌కుండానే స్వీక‌రిస్తాడ‌ట‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube