టాలీవుడ్ హీరో జై ఆకాష్ గురించి ఈ విషయం తెలుసా..?!

శ్రీలంక నుంచి వచ్చిన ఒక హీరో టాలీవుడ్ లో  బ్లాక్ బస్టర్ కొట్టాడు.వచ్చీ రావడంతోనే ఒక పెద్ద హిట్టు కొట్టి అందరి నోళ్లలో నానాడు.

 Unknown Details Of Tollywood Hero Jai Akash-TeluguStop.com

ఆ తర్వాత దాదాపు పది సినిమాలకు పైగా నటించాడు.ఆ హీరో ఎవరో తెలుసా. జై ఆకాష్.20 ఏళ్ల కింద శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆనందం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ఆకాష్.ఆకాష్‌ తమిళనాడు నుంచి వచ్చాడని చాలా మంది అనుకుంటారు.కానీ ఆకాష్ పుట్టిపెరిగింది శ్రీలంకలో.ఆకాష్ కొలంబోలో జన్మించాడు.కొన్నాళ్ళు అక్కడ ఉన్న తర్వాత లండన్ కి వెళ్ళిపోయారు.

అక్కడి నుంచి ఇండస్ట్రీలోకి వచ్చాడు.వచ్చి రావడంతోనే మంచి విజయాలు అందుకొన్నాడు.

 Unknown Details Of Tollywood Hero Jai Akash-టాలీవుడ్ హీరో జై ఆకాష్ గురించి ఈ విషయం తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేక రేసులో పూర్తిగా వెనుకబడిపోయాడు.ప్రారంభంలో హీరో ఆకాష్ సోలో హీరోగా వరుసపెట్టి సినిమాలు చేశారు.

కానీ, హీరోగా నిలదొక్కుకోలేకపోయారు.

దీంతో, ఆయన తనను పరిచయం చేసిన తమిళ ఇండస్ట్రీ వైపు వెళ్లిపోయారు.

అక్కడ హీరోగా చాలా సినిమాలు చేశారు.అయినా కలిసి రాలేదు.

దీంతో ఆ తరవాత ఆకాష్ క్యరెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు.సునీల్ హీరోగా 2006లో వచ్చిన ‘అందాల రాముడు’ సినిమాతో మళ్లీ టాలీవుడ్‌లోకి ఆకాష్ రీఎంట్రీ ఇచ్చారు.

ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ ప్రేమికుడిగా నటించినా సునీల్‌కే ఎక్కువ మార్కులు పడ్డాయి.ఈ సినిమా తరవాత ‘నవ వసంతం’, ‘గోరింటాకు’, ‘నమో వేంకటేశ’ తదితర చిత్రాల్లో నటించారు.

ప్రస్తుతం ఆకాష్ సినిమా కెరీర్ అంత ఆశాజనకంగా లేదు.ఆకాష్ నటించిన అయిదు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి.

‘ఏ-క్యూబ్’ పేరుతో ఒక మూవీ యాప్‌ను కూడా సిద్ధం చేసుకున్న ఆకాష్ ‘అందాల రాక్షసుడు’గా తెలుగు ప్రేక్షకులను మళ్లీ అలరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

#Jai Akkash #JaiAkash #JaiAkash #Colombo #Pakistani Hero

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు