ఆర్ఆర్ఆర్ ఒలీవియా బ్యాగ్రౌండ్ మామూలుగా లేదుగా..

బాహుబలి సినిమా తర్వాత మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చేపట్టాడు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి.గోండు వీరుడు కొమురం భీమ్, మన్యం వీరుడు అల్లూరి సీతారామారాజు కథలను ఆసరాగా చేసుకుని తెరకెక్కిస్తున్న సినిమా త్రిపుల్ ఆర్. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న జనాల ముందుకు రానుంది.ఇప్పటికే ఈ సినిమాపై ఓ రేంజిలో అంచనాలు నెలకొన్నాయి.

 Unknown Back Ground Of Rrr Heroine Olivia Morris Details, Olivia, Olivia Morris-TeluguStop.com

రాజమౌళి ఎప్పటికప్పుడు ఈ సినిమా టెంపో తగ్గకుండా చర్యలు తీసుకుంటూనే ఉన్నాడు.కథ విషయంలోనే కాదు.

పాత్రల విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.అందులో భాగంగానే ఎన్టీఆర్ కు జోడీగా ఈ సినిమాలో ఇంగ్లీష్ భామ ఒలీవియా నటిస్తోంది.

ఇంతకీ ఈ అమ్మడు బ్యాగ్రౌండ్ వింటే వామ్మో అనాల్సిందే.

ఆర్ ఆర్ ఆర్ సినిమాను డీవీవీ ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై దిగ్గజ నిర్మాత డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాలో రాంచరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు.చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తోంది.

ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా నటిస్తోంది.

ఇంతకీ ఈ ఒలివియా ఎవరు? అనే అంశంపై సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి.ఈ ఇంగ్లీష్ ముద్దుగుమ్మ 1997లో లండన్ లో జన్మించింది.

Telugu Olivia Morris, Alia Bhatt, Englishactress, London, Olivia, Oliviamorris,

ఆమె చిన్నప్పటి నుంచి అమ్మమ్మ దగ్గరే పెరిగిందట.చిన్న ఏజ్ లోనే టీవీ, సినిమా రంగాలై ఆసక్తి పెంచుకుంది.ఆమె స్కూలింగ్ లోనే నటనలో ట్రైనింగ్ తీసుకుంది.

ఆ తర్వాత యాక్టింగ్ టీచర్ గా కొంతకాలం పని చేసింది.అనంతరం లండన్ రాయల్ వెల్ష్ మ్యూజిక్ డ్రామా కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేసింది.

అటు వారం రోజుల్లోనే మినీ అడ్వెంచర్ టీవీ సిరీస్ కంప్లీట్ చేసి కొత్త రికార్డు నెలకొల్పింది.

Telugu Olivia Morris, Alia Bhatt, Englishactress, London, Olivia, Oliviamorris,

లండన్ ఫ్యాషన్ వీక్‌తో సహా అనేక ఫ్యాషన్ వీక్ షోలలో ఈ ముద్దుగుమ్మ పార్టిసిపేట్ చేసింది.ఆ తర్వాత ఈమె ప్రతిష్టాత్మక త్రిపుల్ ఆర్ సినిమాకు ఎంపిక అయ్యింది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించేందుకు ఓకే చెప్పింది.

ఆమె ఎవరు అనే అంశం గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేశారు.దీంతో ఆమెకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube