రాజశేఖర్‌లో మరో యాంగిల్.. దీని గురించి ఎవరికీ తెలియదు

Unknown Angle In Hero Rajasekhar

రాజశేఖర్. ఈ పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది అంకుశం మూవీ.

 Unknown Angle In Hero Rajasekhar-TeluguStop.com

ఇందులో ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ క్యారెక్టర్‌లో రాజశేఖర్ ఇరగదీశారు.ఈ సినిమాతో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

క్యారెక్టర్ ఏదైనా సరే అందులో రాజశేఖర్ జీవిస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలే కాదు.

 Unknown Angle In Hero Rajasekhar-రాజశేఖర్‌లో మరో యాంగిల్.. దీని గురించి ఎవరికీ తెలియదు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రేమ కథలకు సంబంధించిన మూవీల్లోనూ నటించి తన సత్తా చాటాడు.ఇలాంటి మూవీస్‌లో అల్లరి ప్రియుడు మూవీ స్పెషల్.

రాఘవేందర్ రావు డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో మంచి హిట్ అందుకుంది.సంగీత ప్రియులకు ఈ మూవీ ఓ బహుమతి లాంటిది.

ఈ మూవీలోని పాటలు ఇప్పటికీ వింటూ ఎంజాయ్ చేస్తున్నారంటే అందులోని పాటలో ఏ రేంజ్ లో హిట్టయ్యాయో స్పెషల్‌గా చెప్పనవసరం లేదు.

ఇక ఆ సినిమాకు సంబంధించిన 100 డేస్ ఫంక్షన్‌ను చెన్నైలోని పార్క్ హోటల్‌లో గ్రాండ్‌గా అప్పట్లో సెలబ్రేట్ చేశారు.

ఇక అభిమానుల సందడి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనేలేదు.అందరూ ఆటోగ్రాఫ్ కోసం రాజశేఖర్ వద్దకు వచ్చారు.అప్పటికే టైం చాలా అయింది.లేట్ అవుతున్నా.

రాజశేఖర్ మాత్రం అందరితో మాట్లాడుతూ ఆటోగ్రాఫ్‌లు ఇస్తున్నాడు.ఇదే సమయంలో ఆయనకు ఓ పర్సన్ చీటీ ఇచ్చారు.

దానిపై ఆటోగ్రాఫ్ ఇవ్వబోయిన రాజశేఖర్.ఒక్కసారిగా ఆగి దానిని ఓపెన్ చేసి చూశాడు.

Telugu 100 Days Function, Allari Priyudu Movie, Ankusham Movie, Autogram, Director Raghavendra Rao, Hero Rajasekhar, Rajasekhar, Rajasekhar Brother Gunasekhar, Rajasekhar Helped-Movie

తన కొడుకుకు సర్జరీ చేయాల్సి ఉంది.అందుకోసం డబ్బు అవసరం.సాయం చేయాలంటూ అందులో రాసి ఉండటాన్ని చూసిన రాజశేఖర్.అతన్ని దగ్గరకు పిలిపించుకుని వివరాలు ఆరా తీశాడు.ఆ చీటీ వెనకాల తన అడ్రస్ రాసి మరుసటి రోజు ఉదయం తన తమ్ముడిని కలవాటంటూ సదురు వ్యక్తికి సూచించాడు.అదే సమయంలో తన తమ్ముడు గుణశేఖర్‌ను పిలిచి సదురు వ్యక్తికి పరిచయం చేశాడు.

నటులు చేసే సేవా గుణం చాలా సందర్భాల్లో బయటపడుతుంది.కానీ దానికి ఎక్కువగా ఎవరూ పట్టించుకోరు.

మూవీస్‌లో ఎన్ని క్యారెక్టర్స్ చేసిన ఇలాంటి పని రియల్‌గా చేసినప్పుడు కలిగే ఆనందం, సంతోషం వేరే.

#Ankusham #Rajasekhar #Raghavendra Rao #Autogram #Allari Priyudu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube