'నందమూరి సుహాసిని' గురించి చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలివే.! ఆస్తులు ఎంతో తెలుసా.?     2018-11-20   08:38:02  IST  Sai Mallula

“నందమూరి సుహాసిని”..ఈ పేరు గత నాలుగు రోజుల వరకూ ఎవరికీ తెలియదు. నందమూరి అభిమానులకు కూడా పెద్దగా తెలియదు. నందమూరి హరికృష్ణకు ఓ కుమారై ఉందని తెలిసుండొచ్చేమో కానీ, ఆమె పేరు సుహాసిని అని తెలియదు.కానీ ఇప్పడు ఆమె ఎవరో తెలుసుకోవడానికి గూగుల్‌లో తెలుగు ప్రజలు బాగా సెర్చ్ చేస్తున్నారు. దీంతో గూగుల్‌లో ఆమె పేరు ట్రెండింగ్‌గా మారింది. గూగుల్‌లో ఎక్కువ మంది వెతికిన వారిలో ఆమె ఒకరుగా నిలిచారు. అయినా ఆమె గురించి తెలిసే విషయాలు కొన్నే ఉంటాయి. ప్రధానంగా చెప్పుకోవాలంటే సుహాసిని హరికృష్ణ కుమార్తె, కల్యాణ్‌రాం, జూనియర్ ఎన్టీఆర్‌లకు సోదరి. సుహాసిని టీడీపీ అభ్యర్థిగా కూకట్‌పల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని, నామినేషన్ల గడువు ప్రారంభమయ్యే వరకు టీటీడీపీ ముఖ్యనేతలు కూడా ఊహించలేకపోయారు.

Unknown And Interesting Facts About Nandamuri Suhasini-Kukatpally Constituency Suhasini TDP

Unknown And Interesting Facts About Nandamuri Suhasini

కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా సుహాసిని శనివారం నామినేషన్‌ వేశారు. బాబాయి బాలకృష్ణ, పార్టీ నేత పెద్దిరెడ్డితో కలిసి ఉదయం 11:21 గంటలకు ముసాపేట జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఆమె నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. అంతకుముందు ఆమె బాలకృష్ణ, రామకృష్ణ, ఇతర నందమూరి కుటుంబసభ్యులతో కలిసి ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకొని నివాళులర్పించారు. ఆమె ప్రొఫైల్ వివరాలు ఇవే.

Unknown And Interesting Facts About Nandamuri Suhasini-Kukatpally Constituency Suhasini TDP

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి సుహాసిని ప్రొఫైల్‌:
పేరు : నందమూరి వెంకట సుహాసిని
తండ్రి : నందమూరి హరికృష్ణ(లేట్‌)
చదువు : ఎల్‌ఎల్‌బీ (1999), పెందెకంటి లా కళాశాల, హైదరాబాద్‌)
ఆదాయం : ఇళ్ల అద్దెలు
వృత్తి : సోషల్‌ యాక్టివిటీస్‌
భర్త పేరు : చుండ్రు వెంకట శ్రీకాంత్‌
కుమారుడు : చుండ్రు వెంకట శ్రీహర్ష
2018-19 ఆదాయపన్ను రిటర్న్‌ : రూ.10,53,300/-
చేతిలో ఉన్న నగదు నిల్వ : రూ.1,50,000
భర్త వద్ద నగదు : రూ.2,00,000
కుమారుడి వద్ద నగదు : రూ.1లక్ష
షేర్లు : కుటుంబ సభ్యులకు మిక్‌ ఎలక్ర్టానిక్స్‌, శ్రీభవాని క్యాస్టింగ్‌ లిమిటెడ్‌ కంపెనీల్లో ప్రస్తుత విలువ ప్రకారం
రూ.5.50లక్షల విలువైన షేర్లు ఉన్నాయి. కారు : రూ.15లక్షల హుందాయ్‌ క్రిటా
బంగారం : రూ.71లక్షల విలువైన 2.2కిలోల బంగారం
వజ్రాల విలువ : రూ.30లక్షలు
వెండి : 31లక్షల విలువైన 81 కిలోల వెండి
మొత్తం ఆస్తుల విలువ : రూ.1,52,41,493
భర్త ఆస్తుల విలువ : రూ.7లక్షలు
కుమారుడి ఆస్తులు : రూ.1,02,60,000

Unknown And Interesting Facts About Nandamuri Suhasini-Kukatpally Constituency Suhasini TDP

స్థిరాస్తులు
ఫిల్మ్‌నగర్‌లో రూ.4.30కోట్ల విలువైన 450గజాల స్థలంలో ఇల్లు. భర్తకి తూర్పుగోదావరి జిల్లాలోని కొమరగిరిలో రూ.65లక్షల విలువైన 3.20ఎకరాల భూమి ఉంది. కుమారుడికి తూర్పుగోదావరి జిల్లాలోని మండపేటలో రూ.88.38లక్షల విలువైన 2455గజాల స్థలం ఉంది. అప్పు: రూ.1.46,28,246