విడ్డూరం : పరీక్షల్లో బాగా మార్కులు రావాలని విద్యార్థులను సమాధుల్లో పండబెడుతున్నారు

ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు అన్ని విధాలుగా ముందు ఉండాలి.ఎలాంటి విషయాన్ని అయినా వెంటనే అర్థం చేసుకోవడంతో పాటు, వెంటనే దాన్ని నేర్చుకునే సత్తాను కలిగి ఉండాలి.

 University Students Meditation For Stress Relief-TeluguStop.com

ఈ కారణాల వల్ల విద్యార్థులపై ఈమద్య కాలంలో చాలా ఒత్తిడి పడుతుంది.ప్రతి ఒక్కరు ఒప్పుకునే విషయమై అయినా కూడా తప్పని సరి పరిస్థితుల్లో తప్పడం లేదు అంటున్నారు.

స్కూల్స్‌, కాలేజ్‌లు, యూనివర్శిటీలు అన్నింట్లో కూడా విద్యార్థులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.అయితే కొన్ని చోట్ల ఒత్తిడిని జయించేందుకు కొన్ని రకాల యాక్టివిటీస్‌ చేయిస్తూ ఉంటారు.

కొందరు యోగా చేయిస్తే కొందరు మెడిటేషన్‌ చేయిస్తారు, కొందరు డాన్స్‌లు వేయిస్తారు, కొందరు పాటలు పాడిస్తారు, మరి కొందరు సినిమాలకు తీసుకు వెళ్తారు.ఇలా రకరకాలుగా ఒత్తిడిని జయించేందుకు ప్రయత్నాలు చేస్తారు.

అయితే నెదర్లాండ్‌లోని నిజ్మాజెన్‌లో ఉండే రాడ్‌ బౌడ్‌ అనే యూనివర్శిటీలో ఒత్తిడిని జయించేందుకు విద్యార్థులకు అక్కడ ప్రొపెసర్లు వింత పద్దతిని తీసుకు వచ్చారు.సాదారణంగా చనిపోయాక సమాదిలో పెడతారు.

కాని ఆ యూనివర్శిటీలో కొన్ని సమాదులు ఏర్పాటు చేసి ఆ సమాదుల్లో విద్యార్థులను ఉంచుతున్నారు.

Telugu Grave Stress, Grave, Telugu Ups-

వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం.మొదట విద్యార్థులు సమాదుల్లోకి వెళ్లి పడుకుని మెడిటేషన్‌ చేసేందుకు ఒప్పుకోలేదు.సమాధిలో మెడిటేషన్‌ ఏంటీ అంటూ విడ్డూరంగా ప్రశ్నించారు.

కాని అందులోకి వెళ్లి వచ్చిన ఒక్కరు ఇద్దరు విద్యార్థులు తమకు ఒత్తిడి పోయి హాయిగా ఉందని చెప్పడంతో విద్యార్థులు అంతా క్యూ కడుతున్నారు.గంట నుండి మూడు గంటల వరకు విద్యార్థులు మెడిటేషన్‌ చేసేందుకు సమాదిలో ఉంటారు.

Telugu Grave Stress, Grave, Telugu Ups-

యూనివర్శిటీలో ఉన్న సమాదులు ప్రస్తుతం సరిపోవడం లేదు.ముందుగా బుక్‌ చేసుకున్న వారికే ఉంటుంది.అలా ఇప్పటికే వారం రోజుల అడ్వాన్స్‌ బుకింగ్‌ ఉందట.అంటే ఏ స్థాయిలో ఆ సమాదులకు డిమాండ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సమాదుల్లో యోగా మెడిటేషన్‌ వంటివి చేయడం పూర్వ కాలంలోనే మన హిందూ రుషులు చేశారు.ఇప్పుడు ఈ పద్దతి నెదర్లాండ్‌ యూనివర్శిటీలో కొనసాగుతుంది.

ముందు ముందు మళ్లీ ప్రపంచ వ్యాప్తంగా ఈ సమాది మెడిటేషన్‌ గురించి ప్రచారం జరిగి ప్రముఖంగా అందరు వెళ్లే అవకాశం ఉందని ప్రముఖులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube