ప్రమోట్ అయిన విద్యార్ధులు పరీక్షలు రాయాల్సిందే..!

కరోనా కారణంగా విద్యావ్యవస్థ పూర్తిగా అయోమయంలో పడింది.వైరస్ విజృంభిస్తోన్న తరుణంలో విద్యార్ధులకు బోర్డు పరీక్షలు నిర్వహించడం అసాధ్యమని, ప్రభుత్వం అన్ని సంవత్సరాల విద్యార్ధులను ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే.

 Students Have To Write Exams Even If They Are Promoted ..!, Telangana Universit-TeluguStop.com

అలాగే, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారిలో ఫైనలియర్ విద్యార్ధులకు మాత్రం పరీక్షలు జరుగుతాయని కూడా స్పష్టం చేసింది.అయితే, ప్రమోట్ అయిన విద్యార్ధులు కూడా పరీక్షలు రాయాల్సి ఉంటుందని ఆయా తెలంగాణ యూనివర్సిటీల ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఈ క్రమంలో విద్యార్ధులు అయోమయ పరిస్థితి నెలకొంది.

ప్రభుత్వం విద్యార్ధులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని స్పష్టం చేసిన వర్సిటీలు మాత్రం పరీక్షల విషయంలో రెండు ఆప్షన్లు ఇస్తున్నాయి.

ఫైనలియర్ విద్యార్ధుల పరీక్షలు ముగిసిన తర్వాత మిగతా సంవత్సరాల విద్యార్ధుల పరీక్షలు నిర్వహిస్తామని అంటున్నాయి.విద్యార్ధులు ఖచ్చితంగా పరీక్షలు రాయాల్సి ఉంటుందని జేఎన్టీయూ, ఉస్మానియా ఉన్నతాధికారులు అంటున్నారు.

లేదా విద్యా సంవత్సరం మధ్యలో ఎప్పుడైనా పరీక్షలు పెడతామని చెబుతున్నాయి.ఈ రెండు విధానాల్లో ఏదో ఒకదాన్ని అమలు చేస్తామని, అయితే, ఉన్నత విద్యా మండలి ఆదేశాల ప్రకారమే నిర్ణయం ఉంటుందని వెల్లడించాయి.

పరిస్థితి చక్కబడిన తరువాత ప్రత్యక్ష క్లాసులను లేదా ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించాలని వర్సిటీలు యోచిస్తున్నాయి.అయితే సెమిస్టర్ ప్రారంభించిన తరువాత, అంతకుముందు సంవత్సరానికి సంబంధించిన పరీక్షలను విద్యార్థులు రాయాల్సి వుంటుందని జేఎన్టీయూ, ఉస్మానియా ఉన్నతాధికారులు అంటున్నారు.

నవంబర్ లేదా డిసెంబర్ లో పరీక్షలు ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.అయితే, పై తరగతులకు ప్రమోట్ అయ్యే విద్యార్థులకు ఈ దఫా క్రెడిట్ డిటెన్షన్ ఉండబోదని స్పష్టం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube