కరోనా నియంత్రణకి వ్యాక్సిన్ తయారు చేసిన హైదరాబాద్ వర్సిటీ ప్రొఫెసర్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలన్నీ మెడిసన్ కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పటికే అమెరికా ఒక వ్యాక్సిన్ తయారు చేసి దానిని క్లీనికల్ ట్రైల్స్ కి ఉపయోగించింది.

 University Of Hyderabad Faculty Develops Potential Vaccine For Corona Virus, Cov-TeluguStop.com

అయితే దాని ఫలితం ఏంటి అనేది ఇప్పటివరకు అమెరికా ప్రకటించలేదు.అయితే ప్రస్తుతం ఇండియాలో అది కూడా హైదరాబాద్ లో యూనివర్శిటీ అఫ్ హైదరాబాద్ లో కరోనాకి వాక్సిన్ తయారు చేసినట్లు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది.

వర్శిటీలో బయో కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా పని చేస్తున్న సీమా మిశ్రా, వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొనే ఔషధాన్ని కనిపెట్టారు.దీనికి ఆమె ‘టీ-సెల్ ఎపిటోప్స్’ అని పేరు పెట్టారు.

ఈ విషయాన్ని వర్శిటీ అధికారికంగా నిర్దారించడం విశేషం.

ప్రయోగశాలలో ఈ వాక్సిన్, వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత నోవల్ కరోనా వైరస్-2 ప్రోటీన్లపై పని చేసిందని పేర్కొంది.

వైరస్ సోకిన వ్యక్తి శరీరంలో చెడిపోయిన కణాలను అంతం చేయడంలో తాము సృష్టించిన ఎపిటోస్ సమర్ధవంతంగా పని చేశాయని, ప్రస్తుతం పరిశోధన దశలో ఉన్న ఈ ఎపిటోస్, మానవ శరీరంలో ఆరోగ్యవంతంగా ఉన్న కణాలకు ఎటువంటి హాని చేయవని ప్రొఫెసర్ సీమా మిశ్రా వెల్లడించారు.పూర్తిస్థాయిలో పరిశోధన జరిగి, తమ ప్రయత్నం సఫలమైతే, పూర్తి జనాభాకు ఒకేసారి వాక్సిన్ ను అందించడం ద్వారా కరోనా వైరస్ ను రూపుమాపవచ్చని తెలిపారు.

దీనిని క్లీనికల్ ట్రయిల్స్ కి ఉపయోగించి తరువాత దీనిపై స్పష్టమైన ప్రకటన ఒకటి చేసే అవకాశం ఉంది.నిజంగా ఈ వాక్సిన్ సమర్దవంతంగా పని చేస్తే ఇక కరోనాని కట్టడి చేయడానికి ఇండియా ప్రపంచ దేశాలకి ఎంతో సాయం చేసినట్లు అవుతుందనే మాట వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube