ట్రంప్ వైఖరిపై యూనివర్సిటీల గుర్రు..ప్రభుత్వ తీరుపై కోర్టులో దావా..!!  

Donald Trump, Universities in America, Indian Students, Online Classes,Harvard University , Anger over US decision on foreign students\' visas - Telugu Anger Over Us Decision On Foreign Students\\' Visas, Donald Trump, Harvard University, Indian Students, Online Classes, Universities In America

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ స్థానికంగా తీవ్ర వ్యతిరేకతని పెంచుకుంటున్నారు.ఇప్పటికే వీసాల విషయంలో విదేశీ ఎన్నారైలలో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్న ట్రంప్.

 Universities Anger Over Trump Decision

తాజాగా అమెరికా యూనివర్సిటీ ల నుంచీ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.ఆన్లైన్ క్లాసులకి మారిన విద్యా సంస్థలకు చెందిన విదేశీ విద్యార్ధులు స్వదేశాలకు వెళ్ళిపోవాలని ట్రంప్ ప్రభుత్వ విధానాలపై గుర్రుగా ఉన్నారు.

ట్రంప్ ప్రభుత్వం ఈ నిభందనలు విధించడం పై సర్వాత్రా నిరసనలు రేగుతున్నాయి.ఈ క్రమంలోనే

ట్రంప్ వైఖరిపై యూనివర్సిటీల గుర్రు..ప్రభుత్వ తీరుపై కోర్టులో దావా..-Telugu NRI-Telugu Tollywood Photo Image

అమెరికా ప్రఖ్యాత హార్వర్డ్ , మసాచుసెట్స్ యూనివర్సిటీ సంయుక్తంగా కోర్టుని ఆశ్రయించాయి.

ట్రంప్ చేపట్టిన ఈ నిభందనలు మాకు ప్రతిభంధకాలుగా మారాయని, ఎంతో మంది విద్యార్ధులపై ఇది తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతుందని తెలిపాయి.ఈ మేరకు అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం, ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ లపై రెండు యూనివర్సిటీలు దావా వేశాయి.

ప్రభుత్వం ఇచ్చిన ఈ నిభందనలు తక్షణమే నిలిపివేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుని కోరారు.

ఎంతో ప్రఖ్యాత విద్యాసంస్థలు గా ఉన్న మా యూనివర్సిటీ లో ఎంతో మంది విద్యార్ధులు చదువుతున్నారని , కనీసం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండా ఇలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం సమంజసం కాదని తెలిపాయి.ప్రభుత్వ నిర్ణయం చట్ట వ్యతిరేకమని, విదేశీ విద్యార్ధులకి న్యాయం జరిగేలా చూడమని కోరాయి.ఇదిలాఉంటే విదేశీ విద్యార్ధులకి న్యాయం జరిగే వరకూ న్యాయపోరాటం చేస్తామని యూనివర్సిటీ అధ్యక్షులు ప్రకటించారు.

#Indian Students #Online Classes #Donald Trump

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Universities Anger Over Trump Decision Related Telugu News,Photos/Pics,Images..